వంశీ-చరణ్ సినిమాకు బ్రేక్?

మహేష్ స్క్రిప్ట్ రిజెక్ట్ చేసిన తరువాత నుంచీ వంశీ పైడిపల్లి ని హీరో రామ్ చరణ్ ను జతచేయాలన్నది నిర్మాత దిల్ రాజు సంకల్పం. మార్చి నాటికి ఆచార్య సెట్ మీదకు వచ్చి మే…

మహేష్ స్క్రిప్ట్ రిజెక్ట్ చేసిన తరువాత నుంచీ వంశీ పైడిపల్లి ని హీరో రామ్ చరణ్ ను జతచేయాలన్నది నిర్మాత దిల్ రాజు సంకల్పం. మార్చి నాటికి ఆచార్య సెట్ మీదకు వచ్చి మే కల్లా ఫ్రీ అయిపోతాడు రామ్ చరణ్. ఆ తరువాత ఏంటీ? అన్నది డిస్కషన్ లో వుంది.

అయితే వంశీ పైడిపల్లి సినిమా అయితే చేయడం లేదని, వేరే ఆలోచనలు సాగుతున్నాయని వినిపిస్తోంది. కచ్చితంగా ఓ సినిమాను యువి విక్కీ కోసం చేయాలని సంకల్పించుకుని వున్నాడు రామ్ చరణ్. అందుకోసం స్క్రిప్ట్, డైరక్టర్ కావాలి. 

ఏప్రిల్ నాటికి ఆ రెండూ సెట్ అయితే ఆ సినిమానే వుంటుందని తెలుస్తోంది. వంశీ పైడిపల్లి ప్రస్తుతం ఓటిటి వ్యవహారాల్లో బిజీగా వున్నారు. 

ఎప్పటికైనా సెట్ అయితే మహేష్  తోనే సినిమా చేయాలనే ఆలోచనతో వున్నారని, ఆ మేరకు ఆయనకు హామీ కూడా వుందని తెలుస్తోంది.

అందువల్ల దిల్ రాజు-వంశీపైడిపల్లి-మహేష్ సినిమా ఎప్పటికైనా వుండే అవకాశం వుంది కానీ, రామ్ చరణ్ తో వుండకపోవచ్చని టాక్ వినిపిస్తోంది.

ప‌చ్చ మీడియా ప‌గ‌టి క‌ల‌లు