లచ్చన్న చుట్టూ పచ్చ రాజకీయం?

తెలుగుదేశం పార్టీకి సర్దార్ గౌతు లచ్చన్నకు సంబంధం ఏంటి అంటే మామూలుగా అయితే అసలు లేదనుకోవాలి.  స్వర్గీయ గౌతు లచ్చన్న బీసీల దేవుడుగా, ప్రజా నాయకుడిగా జనంలో ముద్ర వేసుకున్నారు. అందరికీ ఆరాధ్యుడిగా మెలిగారు.…

తెలుగుదేశం పార్టీకి సర్దార్ గౌతు లచ్చన్నకు సంబంధం ఏంటి అంటే మామూలుగా అయితే అసలు లేదనుకోవాలి.  స్వర్గీయ గౌతు లచ్చన్న బీసీల దేవుడుగా, ప్రజా నాయకుడిగా జనంలో ముద్ర వేసుకున్నారు. అందరికీ ఆరాధ్యుడిగా మెలిగారు. అటువంటి లచ్చన్నను ఇపుడు టీడీపీ వాడేసుకుంటోందా అంటే అవును అనే సమాధానం వస్తుంది.

లచ్చన్న కుమారుడు  మాజీ మంత్రి శివాజీ, మనవరాలు శిరీష టీడీపీలో ఉండడం వల్ల లచ్చన్న కూదా టీడీపీకి చెందినవారే అనుకుంటే పొరపాటే. ఆయన బీసేలందరికీ మార్గదర్శి. ఆయన్ని అలాగే ఉంచడం వల్లనే ఆ మహనీయుడి కి నిజమైన నివాళి అవుతుంది.

అయితే కాదేదీ రాజకీయం అన్న తరహాలో టీడీపీ ఇపుడు శ్రీకాకుళం జిల్లా పలాసాలో లచ్చన్న విగ్రహం చుట్టూ అచ్చమైన రాజకీయ రచ్చకు తెరలేపింది. లచ్చన్న   విగ్రహం పేరుతో ఆ  చుట్టూ టీడీపీ నాయకుల భూ దందా దాగి ఉందంటూ మంత్రి సీదరి అప్పలరాజు చేసిన హాట్ కామెంట్స్ ఇపుడు పలాసాలో టీడీపీ రచ్చ చేయడానికి కారణమని తెలుస్తోంది.

లచ్చన్న విగ్రహాన్ని కూలుస్తామంటూ మంత్రి అన్నారంటూ టీడీపీ ఆరోపిస్తోంది. దాంతో పలాలా ముట్టడికి టీడీపీ ఇచ్చిన పిలుపుతో ఎన్నడూ లేని ఉద్రిక్త పరిస్థితులు ఎదురయ్యాయి. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు సహా కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. 

మొత్తానికి మంత్రి అప్పలరాజు భూ అక్రమార్కుల గురించి మాట్లాడిత్రే లచ్చన విగ్రహాన్ని అడ్డం పెట్టుకుని పచ్చ రాజకీయానికి తెర లేపారని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి లచ్చన్నను కూడా టీడీపీ మనిషిగా చేసేస్తున్నారా అన్నదే బీసీలందరికీ వచ్చే అసలైన డౌట్.

అభిజిత్ బ్రేక‌ప్ ఏమైంది ?