బాలయ్య చెప్పింది నిజమేనా.. ఈ ఫొటోనే సాక్ష్యమా?

ప్రసంగం ప్రారంభిస్తే, ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ఫుల్ స్టాప్ పెడతాడో బాలయ్యకే తెలీదు. ఇక ఆ స్పీచ్ లో నోటికి ఏదొస్తే అది, ఎంతొస్తే అంత మాట్లాడ్డం కూడా ఆయనకు అలవాటే. ఈ క్రమంలో…

ప్రసంగం ప్రారంభిస్తే, ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ఫుల్ స్టాప్ పెడతాడో బాలయ్యకే తెలీదు. ఇక ఆ స్పీచ్ లో నోటికి ఏదొస్తే అది, ఎంతొస్తే అంత మాట్లాడ్డం కూడా ఆయనకు అలవాటే. ఈ క్రమంలో తన కన్నకొడుకు మోక్షజ్ఞపై బాలకృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

శ్రీలీలను హీరోయిన్ గా పెట్టి, తను హీరోగా సినిమా చేస్తానని బాలయ్య చెప్పగా.. మోక్షజ్ఞ ఫైర్ అయ్యాడంట. “గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ, శ్రీలీల నా పిల్ల” అంటూ తండ్రికే స్వీట్ వార్నింగ్ ఇచ్చాడట. ఈ విషయాన్ని స్వయంగా బాలయ్య నోటి వెంట విని తరించింది ప్రేక్షక లోకం.

అయితే బాలయ్య ఏదో ఫ్లోలో అలా వాగేసి ఉంటారని, తండ్రిని మోక్షజ్ఞ అంత మాట అని ఉండడని చాలామంది సర్దుకుపోయారు. మరీ ముఖ్యంగా కల్ట్ నందమూరి అభిమానులు అస్సలు ఊరుకోలేదు. అభిమానుల్ని అలరించడం కోసం బాలయ్య అలా కాస్త గీత దాటి వ్యాఖ్యలు చేశారని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

అయితే ఈరోజు రిలీజైన ఓ ఫొటో చూస్తే మాత్రం బాలయ్య కామెంట్స్ నిజమేనని నమ్మాల్సి వస్తోంది. మోక్షజ్ఞ, తన తండ్రికి నిజంగానే వార్నింగ్ ఇచ్చాడేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే, ఏకంగా శ్రీలీల సరసన ప్రత్యక్షమయ్యాడు మోక్షజ్ఞ.

భగవంత్ కేసరి టీమ్ తో భేటీ అయ్యానంటూ ఓ ఫొటో షేర్ చేశాడు మ్యూజిక్ డైరక్టర్ తమన్. అందులో హీరో, దర్శకుడు, నిర్మాతతో పాటు.. కీలక పాత్ర పోషించిన శ్రీలీల కూడా ఉంది. అయితే ఆమె పక్కనే నవ్వులు చిందిస్తూ మోక్షజ్ఞ కూడా కనిపించడం కొసమెరుపు. దీంతో బాలయ్య స్టేట్ మెంట్ నిజమై ఉంటుందని, నిజంగానే మోక్షజ్ఞ తండ్రికి వార్నింగ్ ఇచ్చి ఉంటాడని సోషల్ మీడియాలో పోస్టులు పడుతున్నాయి.

మరోవైపు భగవంత్ కేసరి టీమ్ తో ఫొటో అంటూ తమన్ ఈ స్టిల్ ను పోస్ట్ చేయడంతో.. చాలామంది ఈ సినిమాలో మోక్షజ్ఞ ఉన్నాడని అనుకుంటున్నారు. దీనికి ఊతమిస్తూ, తన ప్రసంగంలో బాలయ్య కూడా సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఉన్నాయంటూ ఊరించాడు.