ఈ తెలివితేటలు ఎవరివి?

ఉన్నట్లుండి తెలంగాణలో ఒకటే సర్వేల మోత. అన్ని సర్వేల్లో ఒకటే ఆన్సర్. కాంగ్రెస్ గెలిచేస్తోంది. భారాసా ఓడి పోతోంది. భాజపా కలికంలోకి కూడా లేదు. జనసేన, తెలుగుదేశం ఊసు.. జాడ లేనే లేదు.  Advertisement…

ఉన్నట్లుండి తెలంగాణలో ఒకటే సర్వేల మోత. అన్ని సర్వేల్లో ఒకటే ఆన్సర్. కాంగ్రెస్ గెలిచేస్తోంది. భారాసా ఓడి పోతోంది. భాజపా కలికంలోకి కూడా లేదు. జనసేన, తెలుగుదేశం ఊసు.. జాడ లేనే లేదు. 

ఎన్నికలు ఇంకా కాస్త దూరంలోనే వున్నాయి. మామూలుగా చూస్తే కేసీఆర్-కేటీఆర్ లకు పెద్ద వ్యతిరేకత కనిపించడం లేదు. మీడియా మొత్తం ఆల్ మోస్ట్ కంట్రోల్ లో వుంది. భారాసా ఓడిపోతుంది అన్న ఆలోచన పెద్దగా ఎక్కడా వినిపించడం లేదు. ఆంధ్ర మీదైనా అనుమానాలు వున్నాయేమో కానీ తెలంగాణ మీద అస్సలు లేవు.

కానీ.. ఉన్నట్లుండి ఈ కాంగ్రెస్ అనుకూల సర్వేలు ఎలా పుట్టుకు వస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు అరడజను. అన్నీ దాదాపుగా ఒకటే టైపు. ఇప్పటికిప్పుడు ఇవన్నీ ఎలా రెడీ అయ్యాయి. చూస్తుంటే దీని వెనుక ఏదో చాణక్యం వున్నట్లు కనిపిస్తోంది. 

తెలంగాణ జనాల్లో ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయం మీద పెద్దగా దృష్టి లేదు. వుండి వుంటే భాజపాకు ఈ పరిస్థితి వుండదు. కానీ భాజపాను కాకుండా కాంగ్రెస్ నే ప్రత్యామ్నాయంగా జనం భావిస్తున్నారనే ప్రచారాన్ని చాపకింద నీరులా తీసుకెళ్లడానికి ఈ సర్వేలను సాకుగా తీసుకునే చాణక్యం ఎవరిది?

కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి కీలకనేతగా కనిపిస్తున్నా, పార్టీ పరంగా అంత ప్రణాళికలు రచించేంత లేదు. తెలంగాణలో కేసీఆర్ రాకుండా వుండాలని ఆంధ్రకు చెందిన ఓ సామాజిక వర్గం బలంగా కోరుకుంటోంది. కేసీఆర్ మళ్లీ పవర్ లోకి వస్తే జగన్ కు ఎన్నికల్లో సాయం పడతారు. అది జరగకూడదు. 

అందుకే అదే సామాజిక వర్గానికి చెందిన ఓ ఎన్నికల ప్లానింగ్ స్పెషలిస్ట్ కాంగ్రెస్ తరపును ఈ ప్రణాళిక రచించి అమలు చేస్తున్నట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. ఈ సర్వేలకు ఆ వర్గం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందుతున్నాయని తెలుస్తోంది. అలా వచ్చిన సర్వేలను జనాల్లోకి తీసుకెళ్లడంలో అదే వర్గానికి చెందిన వారి వాట్సాప్ చాట్ లు, వాట్సాప్ గ్రూపులు బలంగా కష్టపడతున్నాయి.

దీని వల్ల జనాల్లో చిన్నగా ఆలోచన మొదలవుతుంది. తమ ఓటు వృధా పోకూడదు అనే సైకాలజీ వుండే న్యూట్రల్ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గే అవకాశం వుంది. ఇలా అన్ని విధాలా కష్టపడి కాంగ్రెస్ ను లేపితే, అది గెలిస్తే తమ సర్వేలు నిజమయ్యాయని చెప్పుకోవచ్చు. 

మొత్తం మీద ఇప్పుడు భారాస చెక్ పెట్టాల్సింది కాంగ్రెస్ కో, భాజపా కో కాదు. చాప కింద నీరులా పని చేస్తున్న ఈ వర్గానికి. అసలు మీడియాను భారాస కు వదిలేసి, సోషల్ మీడియాను వాడుకుని నెగిటివ్ చేస్తూ తెలంగాణ కోటలో పాగా వేయాలనుకునే ఈ వర్గానికి.