భోళాశంకర్…వచ్చేసాడు

మెగాస్టార్ లేటెస్ట్ మూవీ భోళాశంకర్. ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా షూట్ చకచకా జ‌రుగుతోంది. అటు గాడ్ ఫాదర్ (లూసిఫర్ రీమేక్) ఇటు భోళాశంకర్ సినిమాల షూటింగ్…

మెగాస్టార్ లేటెస్ట్ మూవీ భోళాశంకర్. ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా షూట్ చకచకా జ‌రుగుతోంది. అటు గాడ్ ఫాదర్ (లూసిఫర్ రీమేక్) ఇటు భోళాశంకర్ సినిమాల షూటింగ్ ను సమాంతరంగా చేస్తున్నారు మెగాస్టార్. 

భోళాశంకర్ కూడా రీమేక్ నే. ఈ సినిమా లో మెగాస్టార్ ఎలా వుండబోతున్నారో మహా శివరాత్రి సందర్భంగా రివీల్ చేసారు.

మాంచి భారీ జీప్ ముందు బంపర్ మీద కూర్చున్న మెగాస్టార్ లుక్ ను రివీల్ చేసారు. ఇటు రెండు హెడ్ లైట్లు, అటు రెండు హెడ్ లైట్లు..మీదన నాలుగు హెడ్ లైట్లు..వెలుగుతుండగా వీటి మధ్య బంపర్ మీద ఠీవిగా కూర్చున్న మెగాలుక్ ఇది. షార్ట్ హైర్ తో, స్లిమ్ లుక్ తో కనిపించారు మెగాస్టార్.

ఇప్పటి వరకు లూసిఫర్ లుక్ బయటకు రాలేదు. అది కచ్చితంగా మిడిల్ ఏజ్డ్ లుక్ తో డిఫరెంట్ గా వుంటుందని ఊహిస్తున్నారు. మొత్తం మీద ఈ ఏడాది రెండు సినిమాలు విడుదల చేయబోతున్నారు మెగాస్టార్.