సోహెల్ సెకెండ్ చాప్టర్ రెడీ

బిగ్ బాస్ 4 సీజన్ ముగిసింది. టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ల హడావుడి స్టార్ట్ అయింది. పాతిక లక్షలు తీసుకుని పోటీ లోంచి బయటకు వచ్చిన సోహెల్ హల్ చల్ ఎక్కువగా వుంది.  Advertisement…

బిగ్ బాస్ 4 సీజన్ ముగిసింది. టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ల హడావుడి స్టార్ట్ అయింది. పాతిక లక్షలు తీసుకుని పోటీ లోంచి బయటకు వచ్చిన సోహెల్ హల్ చల్ ఎక్కువగా వుంది. 

మెగాస్టార్ అభిమానం పొందడం, బ్రహ్మానందం లాంటి వాళ్ల అభిమానం కూడా చూరగొనడం సోహెల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుతోంది.

గతంలో సోహెల్ ఒకటి రెండు సినిమాలు అటెంప్ట్ చేసాడు. తనే స్వంతగా ఓ సినిమా తీయాలని అనుకున్నాడు. అదంతా గతం. ఇప్పుడు సెకెండ్ చాప్టర్ స్టార్ట్ అవుతోంది. ఆఫర్ట్ బిగ్ బాస్ తొలి సినిమాను రేపు ప్రకటిస్తున్నారు.

జార్జిరెడ్డి, ప్రెషర్ కుక్కర్ సినిమాలు నిర్మించిన నిర్మాత సోహైల్ తో సినిమాను ప్రకటించబోతున్నారు. గతంలో బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన వారు ఎవ్వరూ కాస్త సందడి చేసిన తరువాత దాదాపు గాయబ్ అయ్యారు. 

ఈసారి ఎలా వుంటుందో చూడాలి. సోహైల్ కు వున్న మాస్ లుక్ అతన్ని కాస్త నిలదొక్కుకునేలా చేస్తుంది అనేటాక్ అయితే ఇండస్ట్రీలో వుంది.

అభిజిత్ బ్రేక‌ప్ ఏమైంది ?