సీనియర్ నటి డేటింగ్?

ప్రేమలకు అనుబంధాలకు వయసుతో సంబంధం వుండదు. ఏ వయసులో అయినా ఎవరి ఒకరు తోడుగా వుండాలని కోరుకోవడం తప్పూ కాదు.  Advertisement ఓ సీనియర్ నటి ఒకరు ఇలాగే కోరుకుంటున్నారని, ఓ వ్యాపారితో సన్నిహిత…

ప్రేమలకు అనుబంధాలకు వయసుతో సంబంధం వుండదు. ఏ వయసులో అయినా ఎవరి ఒకరు తోడుగా వుండాలని కోరుకోవడం తప్పూ కాదు. 

ఓ సీనియర్ నటి ఒకరు ఇలాగే కోరుకుంటున్నారని, ఓ వ్యాపారితో సన్నిహిత స్నేహ బంధం నెరపుతున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

యాభైలు దాటేసిన ఆ సీనియర్ నటి ప్రస్తుతం పెద్దగా నటించడం లేదు.  ఒంటరిగా వుంటున్న ఆమె ఓ నార్త్ ఇండియన్ వ్యాపారితో సన్నిహితంగా వుంటున్నట్లు తెలుస్తోంది. 

ఒక దశలో పెళ్లి ఆలోచన కూడా చేసారని, అయితే ఈ వయసులో అలాంటి నిర్ణయం తీసుకోవడం అంత బాగుండదనే ఉద్దశంతో ఆ బంధం అలా కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.

ఇటీవల టాలీవుడ్ లో లేటు వయసు పెళ్లిళ్లు జరుగుతుండడంతో ఈ నటి కూడా పెళ్లి చేసుకుంటారేమో అన్న గ్యాసిప్ లు, ఈ వయసులో బాగుండదనే కామెంట్లు రెండూ వినిపిస్తున్నాయి.

ప‌చ్చ మీడియా ప‌గ‌టి క‌ల‌లు