నీకు 15, నాకు 21.. ప్రాణాలు తీసిన వయసు

సహజంగా భార్యాభర్తల్లో భార్య కంటే భర్త వయసు కాస్త ఎక్కువగా ఉంటుంది. శాస్త్రీయంగా, సెంటిమెంట్ పరంగా ఎన్ని కారణాలు చెప్పినా.. అనాదిగా ఇది కొనసాగుతూ వస్తుంది. మరి అమ్మాయి వయసు 21 ఉండి, అబ్బాయి…

సహజంగా భార్యాభర్తల్లో భార్య కంటే భర్త వయసు కాస్త ఎక్కువగా ఉంటుంది. శాస్త్రీయంగా, సెంటిమెంట్ పరంగా ఎన్ని కారణాలు చెప్పినా.. అనాదిగా ఇది కొనసాగుతూ వస్తుంది. మరి అమ్మాయి వయసు 21 ఉండి, అబ్బాయి వయసు 15 ఏళ్లు మాత్రమే ఉంటే? సరిగ్గా ఇక్కడే ఓ ప్రేమజంట తప్పుడు నిర్ణయం తీసుకుంది. తమ ప్రేమకు వయసు అడ్డంకి అనుకొని భ్రమపడి ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది ఈ ఘోరం.

జిల్లాలోని గార్ల మండలానికి చెందిన ప్రశాంత్ అనే అబ్బాయి పదో తరగతి చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి డిగ్రీ చదువుతోంది. ఇద్దరికీ కొన్నాళ్ల కిందట పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వయసులో వ్యత్యాసం ఉండడంతో వీళ్లు తమ ప్రేమ విషయాన్ని మూడో వ్యక్తికి చెప్పలేదు.

అలా కొన్నాళ్లు రహస్యంగా ప్రేమించుకున్నారు. అయితే ఇలాంటి విషయాలు ఎక్కువ రోజులు దాగవు. సోమవారం నాడు రెండు కుటుంబాలకు విషయం తెలిసింది. దీంతో ఈ ప్రేమ జంట అదే రోజు తమ ఇళ్ల నుంచి పారిపోయారు.

వీళ్లిద్దరి కోసం వెదుకుతున్న క్రమంలో ఊరు శివార్లలోని వ్యవసాయ బావిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. వయసు తేడా వల్ల తమ ప్రేమను పెద్దలు అంగీకరించరేమో అనే భయంతోనే వీళ్లిద్దరూ ఆత్మహత్య చేసుకొని ఉంటారని, పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప‌చ్చ మీడియా ప‌గ‌టి క‌ల‌లు