జగన్ కి అరుదైన గౌరవం

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అరుదైన గౌరవం దక్కింది. ఆ ఘనతను వైఎస్ జగన్ మాత్రమే సొంతం చేసుకున్నారు. ఒక యుద్ధ నౌకను ప్రారంభించి జాతికి అంకితం చేయడం అన్నది జగన్ లభించిన గొప్ప అవకాశం. నిజంగా…

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అరుదైన గౌరవం దక్కింది. ఆ ఘనతను వైఎస్ జగన్ మాత్రమే సొంతం చేసుకున్నారు. ఒక యుద్ధ నౌకను ప్రారంభించి జాతికి అంకితం చేయడం అన్నది జగన్ లభించిన గొప్ప అవకాశం. నిజంగా ఇలాంటివి రాష్ట్రపతి కానీ రక్షణ మంత్రి వంటి వారు కానీ ప్రారంభిస్తారు.

కానీ జగన్ కి మాత్రం ఇంతటి విలువైన గౌరవం దక్కడం మాత్రం గ్రేట్ అనే అనాలి. పైగా ఆ యుద్ధ నౌకకు ఐ ఎన్ ఎస్ విశాఖ అని పేరు పెట్టి డాల్ఫిన్‌ లైట్‌హౌస్‌, డాల్ఫిన్‌ నోస్‌, కృష్ణజింకను ముద్రించారు. ఇక జగన్ కి తూర్పు నావికా దళం గౌరవ వందనం చేయడంతో పాటు, ముఖ్యమంత్రిని చాలా ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ విశాఖలో మిలాన్ పేరిట నావీ చేపట్టిన అతి పెద్ద నావికాదళ విన్యాసాసం యావత్తు విశాఖకే గర్వకారణం అన్నారు. అదే విధంగా నేవల్‌ డాక్‌యార్డ్‌లో ఐఎన్‌ఎస్‌ వేలా జలాంతర్గామిని సీఎం వైఎస్‌ జగన్‌ సందర్శించడమే కాదు, లోపల జరిగే  కార్యకలాపాలను ఆసక్తిగా తిలకించారు.

విశాఖలో జరిగిన నావికాదళ యుద్ధ విన్యాసాలను ఆయన తిలకించి పులకించారు. అదే టైమ్ లో దాదాపు నలభై దేశాలకు చెందిన నావికాదళ ప్రతినిధులను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. మొత్తానికి ఏ సీఎం కి దక్కని అరుదైన గౌరవం మాత్రం జగన్ కి మిలాన్‍ 2022 రూపంలో దక్కింది.