లైమ్ లైట్లో ఉన్న హీరోయిన్లకు ట్రోలింగ్స్ సర్వసాధారణం. వాటిని ఎంత లైట్ తీసుకుంటే అంత మంచిది. అయితే అలాంటి ట్రోలింగ్స్ లో కొన్ని బాధించే సలహాలు, విమర్శలు కూడా ఉంటాయి. మరీ ముఖ్యంగా బాడీ షేమింగ్ కామెంట్స్ హీరోయిన్లను బాగా ఇబ్బంది పెడుతుంటాయి. అందగత్తెగా పేరు తెచ్చుకున్న దీపిక పదుకోన్ కు కూడా బాడీ షేమింగ్ కామెంట్స్ తప్పలేదు.
తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది దీపిక పదుకోన్. తన వక్షోజాల సైజు పెంచుకోమంటూ (బ్రెస్ట్ ఇంప్లాంట్) ఓ వ్యక్తి తనకు సలహా ఇచ్చాడని చెప్పుకొచ్చింది దీపిక. ఆ టైమ్ లో తనకు చాలా కోపం వచ్చిందని, కానీ ఆ ఘటనను తను చాలా త్వరగా మరిచిపోయానని చెప్పుకొచ్చింది.
ఆమె నటించిన గెహరాయియాన్ సినిమా తాజాగా ఓటీటీలో రిలీజైంది. ఆ మూవీ ప్రమోషన్ కోసం వరుసగా ఆమె ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉంది. ఇందులో భాగంగా జీవితంలో ఎదురైన అతి చెత్త సలహా ఏంటంటూ దీపిక పదుకోన్ ను ప్రశ్నించాడు ఓ జర్నలిస్ట్. దీనికి పై విధంగా సమాధానం ఇచ్చింది.
తన ఎద సైజును పెంచుకోమంటూ వచ్చిన సలహానే అతి చెత్త సలహాగా పేర్కొంది. అయితే ఆ సలహా ఇచ్చింది ఎవరనే విషయాన్ని మాత్రం దీపిక బయటపెట్టలేదు. షారూక్ ఖాన్ ను తన జీవితంలో ది బెస్ట్ సలహా ఇచ్చిన వ్యక్తిగా పేర్కొంది దీపిక.
తెలిసిన వాళ్లతో సినిమాలు చేయమని షారూక్ సూచించాడట. సినిమాలు చేయడమంటే కేవలం నటించడం కాదని, జీవితంలో ఓ భాగమని, కాబట్టి కొన్ని జ్ఞాపకాల్ని, అనుభవాల్ని పొందే క్రమంలో తెలిసిన వాళ్లతో ట్రాలెవ్ చేయడమే మంచిదని షారూక్ తనకు సలహా ఇచ్చినట్టు చెప్పుకొచ్చింది.