సెబాసూ..సెభాష్టియనూ

తనకంటూ ఓ స్టయిల్ ను ఒకటి రెండు సినిమాలతోనే సెట్ చేసుకుంటున్న హీరో కిరణ్ అబ్బవరం. అతగాడి లేటెస్ట్ మూవీ సెబాస్టియన్. ఈ సినిమా ట్రయిలర్ విడుదలయింది.  Advertisement రేచీకటి సమస్య వున్న కానిస్టేబుల్…

తనకంటూ ఓ స్టయిల్ ను ఒకటి రెండు సినిమాలతోనే సెట్ చేసుకుంటున్న హీరో కిరణ్ అబ్బవరం. అతగాడి లేటెస్ట్ మూవీ సెబాస్టియన్. ఈ సినిమా ట్రయిలర్ విడుదలయింది. 

రేచీకటి సమస్య వున్న కానిస్టేబుల్ పాత్ర చుట్టూ తిరిగే కథతో తయారవుతున్న సినిమా ఇది. హీరో కిరణ్ కు ఓ ప్రత్యేకమైన మాట తీరు వుంది. అదే అతనికి ప్లస్ పాయింట్. పైగా పక్కా కామన్ కుర్రాడిలా వుంటాడు. దాంతో రేచీకటి కానిస్టేబుల్ పాత్రకు పక్కాగా సరిపోయాడు.

ట్రయిలర్ అవుట్ అండ్ అవుట్ ఫన్ టార్గెట్ గా కట్ చేసారు. చిన్న థ్రిల్లర్ టచ్ ఇచ్చారు. యూత్ ను దృష్టిలో పెట్టుకుని చిన్న రొమాంటిక్ టచ్ కూడా ఇచ్చారు. టోటల్ గా ట్రయిలర్ ప్రామిసింగ్ గా అనిపించేలా వుంది. 

ట్రయిలర్ కట్ లో అన్ని జానర్ లను టచ్ చేయడం, ఫన్ డైలాగులు రాసుకోవడం, కాస్త కొత్తగా వుంది అనే ఫీల్ కలిగించడం వంటి జాగ్రత్త లు తీసుకున్నారు.

ఈ నెల 4న విడుదలవుతోందీ సినిమా. ఇప్పటికే భీమ్లా నాయక్ థియేటర్లలోకి వస్తోంది. శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు విడుదలవుతోంది. వీటితో పాటే సెబాష్టియన్ కూడా తన లక్ పరీక్షించుకోబోతోంది.