నాగచైతన్య హీరోగా నటించిన కస్టడీ సినిమాకు, చరణ్ చేస్తున్న గేమ్ ఛేంజర్ కు ఎలాంటి సంబంధం లేదు. కానీ కస్టడీ ఫ్లాప్ అవ్వడంతో, ఇప్పుడు గేమ్ ఛేంజర్ పై సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైంది. ఇంతకీ ఏంటి మేటర్?
ఈమధ్య కాలంలో టాలీవుడ్ లో అడుగుపెట్టిన తమిళ దర్శకులెవ్వరూ తెలుగు హీరోలకు సక్సెస్ ఇవ్వలేకపోయారు. వారియర్ రూపంలో రామ్ కు డిజాస్టర్ ఇచ్చాడు లింగుస్వామి. స్పైడర్ రూపంలో మహేష్ కు డిజాస్టర్ ఇచ్చాడు మురుగదాస్. ఇక తాజాగా కస్టడీ రూపంలో నాగచైతన్యకు ఫ్లాప్ ఇచ్చాడు దర్శకుడు వెంకట్ ప్రభు.
వీళ్లంతా తమిళ దర్శకులే, తెలుగు హీరోలతో సినిమాలు చేసి, మనవాళ్లకు ఫ్లాపులిచ్చారు. ఇప్పుడు మరో దర్శకుడు శంకర్ కూడా తెలుగులో సినిమా చేస్తున్నాడు. అదే గేమ్ ఛేంజర్. అందుకే అందరి దృష్టి ఇప్పుడీ ప్రాజెక్టుపై పడింది.
శంకర్ దర్శకత్వంలో, రామ్ చరణ్ హీరోగా భారీ బడ్జెట్ తో గేమ్ ఛేంజర్ ను నిర్మిస్తున్నాడు దిల్ రాజు. పైగా రాజుకు ఇది ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. అంతా ఓకే అనుకుంటున్న టైమ్ లో ఈ బ్యాడ్ కంపారిజన్ మొదలైంది.
సినిమా అయితే చాలా బాగా వస్తోందంటున్నారు మేకర్స్. షూటింగ్ కూడా 75శాతం పూర్తయింది. మరి ఈ బ్యాడ్ సెంటిమెంట్ కు శంకర్ అడ్డుకట్ట వేస్తాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ..