రెచ్చగొడుతున్న టీడీపీ.. సైలెంట్ అయిన వైసీపీ

తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ రెచ్చగొట్టే ధోరణిలో వెళ్తోంది. వైసీపీ అధికారికంగా అభ్యర్థిని ప్రకటిస్తే.. దాన్ని బూచిగా చూపి స్థానిక ఎన్నికల ప్రస్తావన తేవాలని భావిస్తోంది. అయితే వైసీపీ ఆ ఉచ్చులో పడకుండా…

తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ రెచ్చగొట్టే ధోరణిలో వెళ్తోంది. వైసీపీ అధికారికంగా అభ్యర్థిని ప్రకటిస్తే.. దాన్ని బూచిగా చూపి స్థానిక ఎన్నికల ప్రస్తావన తేవాలని భావిస్తోంది. అయితే వైసీపీ ఆ ఉచ్చులో పడకుండా ప్రస్తుతానికి జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. 

ఇప్పుడు స్థానిక టీడీపీ నాయకులు మరింత దూకుడుగా వెళ్తున్నారు. ముందు వైసీపీ అభ్యర్థి ఎవరో తేల్చాలని పట్టుబడుతున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ ముందుగానే అభ్యర్థిని ప్రకటించడం వెనక కూడా ఇదే రాజకీయ కారణం ఉందని అంటున్నారు విశ్లేషకులు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కరోనాని సాకుగా చూపిస్తూ వాయిదా కోరుతూ వస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. తిరుపతి ఉప ఎన్నికను సాకుగా చూపిస్తూ, స్థానిక సంస్థల ఎన్నికలకు లింక్ పెట్టాలని చూస్తోంది టీడీపీ. అందుకే వైసీపీ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తిరుపతిలో దివంగత ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబానికి టికెట్ ఇవ్వట్లేదనే విషయంపై క్లారిటీ ఇచ్చింది. అసలు అభ్యర్థి ఎవరనే విషయంపై లీకులిచ్చి ఊరుకుంది.

అప్పటినుంచి ఈరోజు వరకు ఉపఎన్నికపై ఎక్కడా ఎవరూ ఎలాంటి కామెంట్ చేయలేదు. తిరుపతి  పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటన సందర్భంగా.. అభ్యర్థి ఎవరైనా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెబుతున్నారే కానీ, చూచాయగా కూడా పేరు మాత్రం ప్రస్తావించడం లేదు. సీఎం జగన్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండటం వల్లే నేతలంతా ఒకే మాటపై ఉన్నారని తెలుస్తోంది.

అటు టీడీపీ మాత్రం వైసీపీ నేతలు నోరు విప్పేలా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది. తిరుపతి ఎన్నికల అభ్యర్థిని ప్రకటిస్తే.. స్థానిక ఎన్నికలకు వచ్చిన అడ్డంకి ఏంటని ప్రశ్నించాలనుకుంటున్నారు టీడీపీ నేతలు.

మరోవైపు ఎన్నికల కమిషనర్ విశ్వ ప్రయత్నాలు కూడా ఫలించేలా లేవు. జనవరిలో టీకా పంపిణీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, రాష్ట్రాలకు ఈ మేరకు అధికారిక సమాచారం రావడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ స్థానిక ఎన్నికలకు అడ్డంకిగా మారుతోంది.

దీనికితోడు స్ట్రెయిన్ పేరుతో కొవిడ్ మ్యుటేటెడ్ వైరస్ విజృంభిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ ఆశ ఫిబ్రవరిలో కూడా నెరవేరేలా కనిపించడం లేదు. ఈ విషయంలో టీడీపీ ఎంత రెచ్చగొట్టినా, వైసీపీ నేతలు పూర్తి సంయమనంతో వ్యవహరిస్తున్నారు. 

బీజేపీ చిల‌కొట్టుడు