అప్పుడు మాస్, ఇప్పుడు క్లాస్ అంటున్న హీరోయిన్

హీరోయిన్లకు క్లాస్ గా కనిపించే పాత్రలు ఎప్పుడైనా వస్తాయి. కానీ మాస్ అప్పీల్ ఉండే పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి. వచ్చినప్పుడు ఒడిసి పట్టుకోవాలి. ఇస్మార్ట్ శంకర్ విషయంలో అదే పని చేశానంటోంది నభా…

హీరోయిన్లకు క్లాస్ గా కనిపించే పాత్రలు ఎప్పుడైనా వస్తాయి. కానీ మాస్ అప్పీల్ ఉండే పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి. వచ్చినప్పుడు ఒడిసి పట్టుకోవాలి. ఇస్మార్ట్ శంకర్ విషయంలో అదే పని చేశానంటోంది నభా నటేష్. అంతమాత్రానికే తనను ప్రతి సినిమాలో మాస్ గా చూడాలనుకోవడం కరెక్ట్ కాదంటోంది.

నభా నటేష్ హీరోయిన్ గా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ.. సోలో బ్రతుకు సినిమాలో తనది మాస్ క్యారెక్టర్ కాదని అంటోంది.

ప్రతి సినిమాలో అలాంటి పాత్రలు దొరకడం కష్టమని చెబుతోంది. అయితే మాస్ పాత్రల కంటే క్లాస్ పాత్రలు చేయడం చాలా ఈజీ అంటోంది ఈ బ్యూటీ.

“ఇస్మార్ట్‌ శంకర్‌లో మాస్‌ పాత్ర చేశాను. ఇందులో క్లాస్‌ అమ్మాయిగా నటించాను. గర్ల్‌ నెక్ట్స్‌ డోర్‌ పాత్ర. పాత్ర క్యారీ చేయడంలో పెద్దగా ఇబ్బంది పడలేదు. ఎందుకంటే నేను దక్షిణాది అమ్మాయిని. మన సినిమాలే చూస్తూ పెరిగాను. థియేటర్స్‌లో యాక్ట్‌ చేశాను. నాటకాల్లో నటించాను. కాబట్టి పాత్రలో ట్రాన్స్‌ఫార్మ్‌ కావడం నాకు కష్టమేమీ కాదు.”

సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ఎక్కడ ఓటీటీలో రిలీజైపోతుందా అని తెగ మధనపడిందట నభా నటేష్. అలా అని ఓటీటీని చిన్నచూపు చూడడం లేదు ఈ భామ.  సోలో బ్రతుకే సో బెటర్ లాంటి కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను థియేటర్లలో చూస్తేనే కిక్ అంటోంది.

Click Here For Photo Gallery

బీజేపీ చిల‌కొట్టుడు