చంద్రబాబు జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు

151 సీట్ల మెజార్టీతో జగన్ ముఖ్యమంత్రి అయిన రోజు కూడా చంద్రబాబు అంతలా బాధపడి ఉండరు. చరిత్రలో ఎరుగని ఘోర పరాభవాన్ని టీడీపీ మూటగట్టుకున్నందుకు కూడా బాబు అంతగా దిగులుపడి ఉండరు. కొడుకు ఓడిపోయినందుకు…

151 సీట్ల మెజార్టీతో జగన్ ముఖ్యమంత్రి అయిన రోజు కూడా చంద్రబాబు అంతలా బాధపడి ఉండరు. చరిత్రలో ఎరుగని ఘోర పరాభవాన్ని టీడీపీ మూటగట్టుకున్నందుకు కూడా బాబు అంతగా దిగులుపడి ఉండరు. కొడుకు ఓడిపోయినందుకు కూడా చంద్రబాబు ఆ స్థాయిలో కుమిలిపోయి ఉండరు. కానీ.. ముఖ్యమంత్రిగా జగన్ పుట్టినరోజున మాత్రం చంద్రబాబు విలవిల్లాడిపోయారు.

పేపర్లలో జగన్, టీవీల్లో జగన్, సోషల్ మీడియాలో జగన్, ఏ హోర్డింగ్ చూసినా జగన్, మీడియా మొత్తం జగన్..  అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది కంటే.. రెండో ఏడాది జగన్ పుట్టినరోజు కనీవినీ ఎరుగని స్థాయిలో జరిగింది. పార్టీలతో సంబంధం లేకుండా అందరూ జగన్ ఫొటోని వాట్సప్ స్టేటస్ లో పెట్టుకున్నారు. జగన్ తో తమకున్న అనుబంధాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఇదంతా ఏదో జగన్ మెప్పు కోసమో, ఎవరో గుర్తించాలనో కాదు. సహజసిద్ధంగా వారిలో జగన్ పై ఉన్న అభిమానమే ఆ పని చేయించింది. కేవలం వైసీపీ కార్యకర్తలే కాదు.. తటస్థులు కూడా జగన్ ఫొటోలను షేర్ చేశారంటే, ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంలో సోషల్ మీడియాలో పోటీ పడ్డారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సినిమా హీరోలకు సైతం లేని స్థాయిలో జగన్ బర్త్ డే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉండటం విశేషం.

ఒక్కమాటలో చెప్పాలంటే సోమవారం సోషల్ మీడియాలో జగన్ ఓ సంచలనంగా మారాడంతే.

చరిత్రలో నిలిచిపోయేలా రక్తదానం..

జగన్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన కేంద్రాల నిర్వహణ చరిత్రలో నిలిచిపోయేలా సాగింది. రక్తదానం చేయాలని, కార్యకర్తలు తరలి రావాలని ఎక్కడా నాయకులు పిలుపునివ్వలేదు. ఇదేమీ పార్టీ సూచించిన ఉమ్మడి కార్యక్రమం కూడా కాదు. అప్పటికప్పుడు స్థానికంగా వచ్చిన ఆలోచనే.. రాష్ట్రవ్యాప్తంగా ఓ ఉద్యమంలా సాగింది.

రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాలు, మండలకేంద్రాలు, గ్రామాలు.. ఇలా అన్ని స్థాయిల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలంతా రక్తదానం చేశారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే సోమవారం జగన్ పుట్టినరోజు సందర్భంగా జరిగిన రక్తదాన శిబిరాలు రికార్డు నెలకొల్పాయి. 

కేవలం ఎమ్మెల్యే కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన క్యాంపుల్లోనే సగటున 200 యూనిట్ల రక్తం సేకరించగలిగారు బ్లడ్ క్యాంప్ నిర్వాహకులు. 100 యూనిట్లు వస్తే అదే ఎక్కువ అనుకున్న వారు హడావిడిగా ఉదయం 11 గంటలకే రక్త సేకరణ బ్యాగ్ లు, ఇతర మెటీరియల్ అయిపోవడంతో.. కొత్తగా మెటీరియల్ బ్లడ్ క్యాంప్ ల నుంచి తెప్పించుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

కరోనా వల్ల రక్తదానానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో బ్లడ్ బ్యాంకుల్లో బ్లడ్ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు జగన్ పుట్టినరోజు కారణంగా.. దాదాపుగా నెల రోజులకు సరిపడ పాటు బ్లడ్ బ్యాగులు అందుబాటులోకి వచ్చాయంటున్నారు రెడ్ క్రాస్ సంస్థ నిర్వాహకులు.

మొత్తమ్మీద జగన్ పుట్టినరోజు పండగ.. రాష్ట్ర పండగగా జరిగింది. అనాథాశ్రమాలు, వృద్ధుల శరణాలయాల్లో అన్నదానాలు, పేదల కాలనీల్లో వస్త్రదానాలు, ఆస్పత్రుల్లో పండ్లు పంపిణీ, కొన్ని చోట్ల మొక్కల పంపిణీ, పేదల్ని దత్తత తీసుకుని చదివించే నిర్ణయం తీసుకున్నవారు కొందరు, జగన్ పుట్టినరోజున అభివృద్ధి కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చినవారు కొందరు… ఇలా రాష్ట్రవ్యాప్తంగా జగన్ పుట్టినరోజు వైభవంగా సాగింది.

సరిగ్గా ఇదే చంద్రబాబు కడుపుమంటకు కారణమైంది. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబుకి ఏనాడూ ఇలాంటి పుట్టినరోజు జరగలేదు. అధికారంలోకి వచ్చిన కేవలం రెండో ఏడాదే.. జగన్ కి ప్రజలంతా బ్రహ్మరథం పట్టారు. కనీసం ఈ ఊపు చూసిన తర్వాతైనా.. రెఫరెండం, జమిలి అనే మాటలు చంద్రబాబు మానేస్తారేమో చూడాలి.

బీజేపీ చిల‌కొట్టుడు