పవన్ కళ్యాణ్-రానా కాంబినేషన్ లో సినిమా. అలాంటి సినిమాలో రమ్యకృష్ణ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తే ఎలా వుంటుంది? కానీ ఈ చాన్స్ మిస్ అయినట్లు తెలుస్తోంది.
అయ్యప్పన్ కోషియమ్ సినిమా కోసం దర్శకుడు త్రివిక్రమ్ ఓ పవర్ ఫుల్ లేడీ క్యారెక్టర్ ను తయారుచేసినట్లు తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ కోసం రమ్యకృష్ణ అయితే బాగుంటుందని కూడా అనుకున్నట్లు బోగట్టా.
కానీ అంతలోనే మరేం అయిందో, ఎక్కడ బ్రేక్ పడిందో? బాహుబలి తరువాత మళ్లీ రానాకు తల్లిగా రమ్యకృష్ణ అంటే రిపీట్ అవుతుందని అనుకున్నారో, ఆ క్యారెక్టర్ నే తీసేసినట్లు తెలుస్తోంది.
మొత్తం మీద అలా మిస్ అయిపోయింది రమ్యకృష్ణకు మంచి చాన్స్.