భీమ్లా నాయక్ సినిమా విడుదలయింది. భూమి బద్దలయినంత హడావుడి తొలి రోజు నెలకొంది. థాంక్స్ టు ఆంధ్ర ఫ్రభుత్వం. అటు వైపు నుంచి ఆంక్షల హడావుడి లేకుంటే ఇంత గడబిడ వుండేది కాదు.
సరే ఆ సంగతి అలా వుంచితే ఆంధ్రలో బ్రేక్ ఈవెన్ అవుతుందా? అన్నది పాయింట్. ఆంధ్ర ఏరియా 40 కోట్ల రేషియోలో విక్రయించారు. పుష్ప కూడా దాదాపు ఇదే రేషియోలో విక్రయించారు. కానీ బ్రేక్ ఈవెన్ కాలేదు. పైగా పుష్పకు పూర్తిగా ఆంక్షలు లేవు. రేట్లు లిబరల్ గానే అమ్మారు.
భీమ్లా నాయక్ కు కూడా కృష్ణ ఙిల్లాలో మరీ పట్టుదలకుపోయారు తప్ప మిగిలిన ప్రాంతాల్లో కాదు. సీడెడ్ లో కొన్ని చోట్ల 200 నుంచి కొన్ని చోట్ల 500 వరకు విక్రయించారు. అందుకే తోలి రోజు సీడెడ్ లో మంచి అంకెలు కనిపించాయి. ఆంధ్రలో కూడా చాలా చోట్ల 200 విక్రయించారు. ఈస్ట్ గోదావరిలో కొన్ని చోట్ల అయిదు షో లు వేసారు.
ఉత్తరాంధ్ర తొలి రోజు కోటి ఎనబై లక్షల వరకు వచ్చింది. అక్కడ దాదాపు 10 కోట్లు బయ్యర్ కట్టారు. కానీ చిత్రంగా మలిరోజు కింది ఏరియాల్లో మార్నింగ్ షోలు, మాట్నీలు జారిపోయాయి. చీపురుపల్లి లాంటి సెంటర్ లో రెండో రోజు బాగుంటుంది. అక్కడా తగ్గుదల కనిపించింది. థియేటర్లు ఎక్కువ పరిచేయడంతో ఫుల్స్ రాలేదు. ఇలాంటి పరిస్థితి నైజాంలో కింది ఏరియాల్లో కూడా కనిపించింది.
అయితే అడ్వాన్స్ బుకింగ్ వున్న కింది ఏరియాల్లో రెండో రోజు ఆటో మెటిక్ గా ఫుల్స్ వచ్చాయి. ఈ సెంటర్లలో సోమవారం కానీ సరైన రిజల్ట్ తెలియదు. ఉత్తరాంధ్రలో పుష్ప సినిమానే ఏడు కోట్ల పైచిలుకు వచ్చి ఆగిపోయింది. అలాంటి భీమ్లా నాయక్ పది కోట్లకు పైగా రాబట్టాలి. నైజాంలో పుష్ప 42 కోట్ల వరకు రాబట్టినట్లు బోగట్టా. భీమ్లా నాయక్ ఖర్చులతో కలిపి 40 కోట్ల వరకు రాబట్టాల్సి వుంది.
మండే లెక్కలు చూస్తే తప్ప భీమ్లా నాయక్ అసలు విజయం అన్న దానిపై క్లారిటీ రాదు.