అయ్యప్పన్ కోషియమ్ లో కోషి కురియన్ పాత్ర క్రిస్టియన్ నే. కానీ ఆ సినిమాలో ఆ విషయాన్ని ఎక్కువగా ప్రస్తావించరు. ఎక్కువగా ఎలివేట్ చేసే ప్రయత్నం చేయరు. పైగా కేరళలో క్రిస్టియానిటీ ప్రభావం ఎక్కువ కనుక మలయాళ సినిమాల్లో కూడా ఆ ప్రభావం కనిపిస్తూ వుంటుంది. అది చాలా కామన్ గా వుంటుంది.
కానీ అయ్యప్పన్ కోషియమ్ తెలుగు రీమేక్ కు వచ్చేసరికి డానీ…డానియల్ పాత్ర క్రిస్టియన్ అనే విషయాన్ని కాస్త ఎక్కువగా ఎలివేట్ చేసే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుంది. జైలులో క్రిస్టియన్ ప్రేయర్ సీన్ మాతృకలో పెద్దగా వుండదు.
జస్ట్ పాస్ ఆన్ గా అనిపిస్తుంది. కానీ తెలుగులో కావాలని చొప్పించినట్లు కనిపిస్తుంది. అదే విధంగా మాతృకలో ‘అరే డానీ..బయకటి రారా నా కొడకా’ లాంటి డైలాగు వుండదు. ముఖ్యంగా అయ్యప్పన్ ఎక్కడా ఎక్కువగా కోషి కురియన్ పేరు వాడినట్లు కనిపించదు.
కానీ తెలుగులో అలా కాదు. డానీ, డేనియల్ అనే పేరు పదే పదే ప్రస్తావించినట్లు కనిపిస్తుంది. ఈ విషయం ఎలా వున్నా సోషల్ మీడియాలో మాత్రం దీని మీద పోస్టింగ్ లు కనిపిస్తున్నాయి. హీరో పవన్ ను హిందువులా చూపించి, విలన్ రానా ను క్రిస్టియన్ లా చూపించారని, అభ్యంతరాలు కనిపిస్తున్నాయి.
ఆంధ్ర సిఎమ్ జగన్ క్రిస్టియన్ కావడం, ప్రతిపక్షంగా వున్న పవన్ ఆయనతో ఢీకొంటున్న విషయం తెలిసిందే.