పూరి – నో సెటిల్ మెంట్..ఓన్లీ సెంటిమెంట్

పూరి జగన్నాధ్ నుంచి తరువాత సినిమా ప్రకటన వచ్చేసింది. హిట్ సెంటి మెంట్ ప్రకారం ఇస్మార్ట్ శంకర్ ప్లేస్ లో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా అనౌన్న్ మెంట్ చేసేసారు.  Advertisement ఇస్మార్ట్ శంకర్ బ్లాక్…

పూరి జగన్నాధ్ నుంచి తరువాత సినిమా ప్రకటన వచ్చేసింది. హిట్ సెంటి మెంట్ ప్రకారం ఇస్మార్ట్ శంకర్ ప్లేస్ లో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా అనౌన్న్ మెంట్ చేసేసారు. 

ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్. లైగర్ సినిమా అరివీర డిజాస్టర్. హోల్ సేల్ బయ్యర్, సప్లిమెంటరీ బయ్యర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్లు ఇలా ఆ సినిమాతో సంబంధం వున్న ప్రతి ఒక్కరూ దారుణంగా నష్టపోయారు. కొన్ని రోజులు నానా గడబిడ నడిచింది. పూరి వాయిస్ లేఖ కూడా వదిలారు. లీగల్ గా ఎవ్వరికీ రూపాయి ఇవ్వక్కరలేదని, కానీ నైతికంగా తాను అందరినీ ఆదుకుంటానని, ఇలాంటి కబుర్లు ఏవేవో చెప్పారు. రోజులు, నెలలు, ఏళ్లు గడిచిపోయాయి. ఎవరికీ సెటిల్ మెంట్ చేసిన దాఖలా అయితే లేదు.

ఎగ్జిబిటర్లు హోల్ సేల్ బయ్యర్ వరంగల్ శ్రీను మీదకు వచ్చారు. కిందా మీదా పడ్డారు. అక్కడితో ఆగింది. పూరి ఇంటి మీదకు వస్తా అంటూ వాట్సాప్ గ్రూప్ ల్లో హడావుడి జరిగింది. దాంతో పూరి పోలీస్ ఫిర్యాదు కూడా ఇచ్చారు. ఇవన్నీ జరిగిన తరువాత అంతా సైలంట్ అయింది. పూరి మీద నమ్మకంతో అందరూ అలా వేచి వున్నారు.

ఇన్నాళ్లలో పూరి పొరపాటున కూడా హోల్ సేల్ బయ్యర్ వరంగల్ శ్రీను ఫోన్ ఎత్తింది లేదు మాట్లాడింది లేదు. ఇక చార్మి కూడా డిటో డిటో.  డబ్బులు ఇవ్వడం, ఇవ్వకపోవడం సంగతి వేరే. ముందు కనీసం మాట్లాడి, ఎంతో కొంత ఇవ్వాలి..లేదా ఇస్తా..ఇలాంటివి ఏవీ లేదు.

పూరి ఓ సినిమాతో చిరంజీవి తో చేస్తారు, బాలకృష్ణ తో సినిమా చేస్తారు అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ ఇద్దరూ కూడా పూరి కనెక్ట్ సంస్థ మీద సినిమా చేయడానికి ఓకె అనలేదు. అందుకే ప్రాజెక్ట్ సెట్ కాలేదని భోగట్టా. దాంతో మళ్లీ రామ్ పోతినేని తో సినిమా ఫిక్స్ చేసుకున్నారు. బాగానే వుంది. సెంటి మెంట్ ప్రకారం ‘డబుల్ ఇస్మార్ట్’ టైటిల్ అన్నారు ఇంకా బాగానే వుంది.

కానీ కౌన్సిల్ దగ్గర ఎగ్జిబిటర్లు మూడు రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నారు. వరంగల్ శ్రీను సర్వం కోల్పోయి మూలన పడ్డారు. పూరి తన సెంటిమెంట్ ను నమ్ముకుని రామ్ తో ముందుకు వెళ్తున్నారు. అందుకోసం ఈ సెటిల్ మెంట్ లు అన్నీ పక్కన పెట్టారు.