కస్టడీ విషయంలో కర్మ సిద్ధాంతమే నిజమైందా?

నాగచైతన్య హీరోగా నటించిన సినిమా కస్టడీ. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు వెంకట్ ప్రభు, అటు కోలీవుడ్ లో ల్యాండ్ అయ్యాడు నాగచైతన్య. సో.. ఎలా చూసుకున్నా,…

నాగచైతన్య హీరోగా నటించిన సినిమా కస్టడీ. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు వెంకట్ ప్రభు, అటు కోలీవుడ్ లో ల్యాండ్ అయ్యాడు నాగచైతన్య. సో.. ఎలా చూసుకున్నా, వీళ్లిద్దరికీ ఇది చాలా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. కానీ రిజల్ట్ మాత్రం వాళ్లు ఆశించినట్టు రాలేదు.

తెలుగులో శనివారం కస్టడీకి సరైన నంబర్స్ రాలేదు. ఇక మిగిలింది ఈరోజు కలెక్షన్లు మాత్రమే. అటు తమిళనాట ఈ సినిమా ఆల్రెడీ ఫ్లాప్ అయింది. సరిగ్గా ఇక్కడే ప్రభాస్ ఫ్యాన్స్ తెరపైకొచ్చారు. కర్మ సిద్ధాంతాన్ని చెబుతున్నారు. పనిలోపనిగా దర్శకుడు వెంకట్ ప్రభుపై ట్రోలింగ్ అందుకున్నారు.

ఇంతకీ ఏమైంది..

కొన్నేళ్ల కిందటి సంగతి.. 2019లో సాహో సినిమా రిలీజైంది. అప్పటికే బాహుబలి-2తో దేశవ్యాప్తంగా ప్రభాస్ పేరు మారుమోగిపోతున్న టైమ్ అది. దీంతో భారీ అంచనాల మధ్య సాహో రిలీజైంది. కానీ అది ఫ్లాప్ అయింది. హిందీ తప్ప అన్ని భాషల్లో ఫెయిలైంది. ఆ టైమ్ లో వెంకట్ ప్రభు ఓ ట్వీటేశాడు.

తమిళనాట సాహోతో పాటు వైభవ్ నటించిన సిక్సర్ అనే సినిమా రిలీజైంది. ఈ రెండు సినిమాల్ని కంపేర్ చేస్తూ, సాహో ఫ్లాప్ అయిందనే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ట్వీట్ వేశాడు వెంకట్ ప్రభు. 'ఈ వీకెండ్ సిక్సర్ గ్యారెంటీ' అనే క్యాప్షన్ కూడా పెట్టాడు.

కట్ చేస్తే, ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి కస్టడీతో ఫ్లాప్ అందుకున్నాడు వెంకట్ ప్రభు. దీంతో 'ఈ సిక్సర్ ఎలా ఉంది' అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ వెంకట్ ప్రభును ఆన్ లైన్ లో వెటకారం చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడీ ట్రోలింగ్ లోకి మెల్లమెల్లగా అక్కినేని ఫ్యాన్స్ కూడా ఎంటరవుతున్నారు.

కస్టడీ తమిళనాట అట్టర్ ఫ్లాప్ అయిన నేపథ్యంలో.. అతడి పాత ట్వీట్ ను మరోసారి వైరల్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. కర్మ అనేది ఎవ్వర్నీ వదిలిపెట్టదని, కాస్త లేట్ అయినా ఎవ్వరికి ఇవ్వాల్సిన ప్రతిఫలం వాళ్లకు అందిస్తుందంటూ వెంకట్ ప్రభుకు ఫిలాసఫీ పాఠాలు చెబుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.