షాకింగ్.. నాగార్జున అతడికి అవకాశం ఇవ్వడం లేదు?

నాగార్జున-మోహన్ రాజా.. ఈ కాంబినేషన్ పై డిస్కషన్ ఇప్పటిది కాదు. చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా స్టార్ట్ చేయకముందు నుంచి ఉంది. గాడ్ ఫాదర్ కోసం మోహన్ రాజాను స్వయంగా నాగార్జున, మెగా కాంపౌండ్…

నాగార్జున-మోహన్ రాజా.. ఈ కాంబినేషన్ పై డిస్కషన్ ఇప్పటిది కాదు. చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా స్టార్ట్ చేయకముందు నుంచి ఉంది. గాడ్ ఫాదర్ కోసం మోహన్ రాజాను స్వయంగా నాగార్జున, మెగా కాంపౌండ్ కు పంపించాడనే టాక్ కూడా అప్పట్లో నడిచింది. గాడ్ ఫాదర్ తర్వాత నాగార్జున సినిమాపై మోహన్ రాజా వర్క్ చేస్తాడని అంతా అనుకున్నారు. నాగార్జున వందో సినిమాకు అతడే డైరక్టర్ అని ఫిక్స్ అయిపోయారు.

అయితే ఇప్పుడీ డిస్కషన్ నుంచి మోహన్ రాజా పేరు సైడ్ అయింది. తన వందో సినిమా కోసం ఓ తమిళ దర్శకుడితో నాగార్జున చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. కోలీవుడ్ కు చెందిన దర్శకుడు నవీన్, నాగార్జునకు 2-3 స్టోరీలైన్స్ వినిపించాడట. వీటిలో ఏదైనా ఓకే అయితే, నాగ్ వందో సినిమా అదే అవుతుంది.

ఇంతకీ ఈ నవీన్ ఎవరు? ఇతడు కోలీవుడ్ టాప్ డైరక్టర్ కాదు. 2013లో ఓ సినిమా తీశాడు. దానికి తనే నిర్మాత,-దర్శకుడు-రచయిత. అందులో ఓ పాత్ర కూడా అతడే పోషించాడు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఆరేళ్లు గ్యాప్ ఇచ్చి మరో సినిమా తీశాడు. ఈసారి డైరక్ట్ చేయలేదు. కేవలం కథ అందించి, ప్రొడ్యూస్ చేశాడు. ఇప్పుడు నాగ్ తో చర్చలు జరుపుతున్నాడు. మధ్యలో విజయ్ ఆంటోనీతో సినిమా ఓకే చేసినా, అది ఆగిపోయింది.

మరి మోహన్ రాజా ఏమయ్యాడు..? నాగార్జున వందో సినిమాకు తను దర్శకత్వం వహించే అవకాశం లేదనే విషయాన్ని మోహన్ రాజా చాన్నాళ్ల కిందటే పరోక్షంగా వెల్లడించాడు. తమ్ముడు జయం రవిని హీరోగా పెట్టి అతడు థని ఒరువన్-2 (తెలుగులో ధృవ) సినిమా ఎనౌన్స్ చేశాడు. అప్పుడే చాలామందికి విషయం అర్థమైపోయింది.

ఇక నాగార్జున విషయానికొస్తే.. విజయ్ బిన్ని దర్శకత్వంలో నా సామిరంగ పేరిట తన 99వ చిత్రాన్ని చేస్తున్నాడు నాగ్. ఈ సినిమా సెట్స్ పై ఉంది. ఓవైపు ఈ సినిమా చేస్తూ, మరోవైపు బిగ్ బాస్ కార్యకలాపాలు చూసుకుంటూ, ఇంకోవైపు తన వందో సినిమాపై ఫోకస్ పెట్టాడు ఈ సీనియర్ హీరో. ప్రయోగాలకు పెట్టింది పేరైన ఈ నటుడు, తన వందో సినిమాకు కూడా స్టార్ డైరక్టర్ తో కాకుండా, కొత్తదనం కోసం వెదుకుతున్నాడు.