నితిన్ కు కొత్త సెంటిమెంట్ కలిసొస్తుందా..?

జాగ్రత్తగా గమనిస్తే, నితిన్ ఫిల్మోగ్రఫీలో ఓ ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. 30కి పైగా సినిమాలు చేసిన ఈ హీరో, డిసెంబర్ నెలలో మాత్రం థియేటర్లలోకి రావడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. కావాలని ఇలా ప్లాన్…

జాగ్రత్తగా గమనిస్తే, నితిన్ ఫిల్మోగ్రఫీలో ఓ ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. 30కి పైగా సినిమాలు చేసిన ఈ హీరో, డిసెంబర్ నెలలో మాత్రం థియేటర్లలోకి రావడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. కావాలని ఇలా ప్లాన్ చేశాడా లేక కాకతాళీయమా అనే విషయాన్ని పక్కనపెడితే.. ఇన్నేళ్ల కెరీర్ లో ఒకే ఒక్కసారి డిసెంబర్ నెలలో థియేటర్లలోకి వచ్చాడు నితిన్.

2014లో చిన్నదాన నీకోసం అనే సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేశాడు నితిన్. అంతకంటే ముందు, ఆ తర్వాత నితిన్ నుంచి ఏ సినిమా డిసెంబర్ లో రాలేదు. మ్యాగ్జిమమ్ మార్చి నుంచి జులై మధ్య అతడి సినిమాలు ఎక్కువగా రిలీజ్ అయ్యాయి. వాటిలో బ్లాక్ బస్టర్స్ కూడా ఉన్నాయి.

ఇప్పుడా సెంటిమెంట్ ను పక్కనపెట్టి మరోసారి డిసెంబర్ లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు నితిన్. ఈసారి ఎక్స్ ట్రా అనే సినిమాతో థియేటర్లలోకి రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఆ డేట్ డిసెంబర్ 8. మరి డిసెంబర్ లో నితిన్ సక్సెస్ కొడతాడా..? తన నెగెటివ్ సెంటిమెంట్ ను తిరగరాస్తాడా?

సాధారణంగా డిసెంబర్ అనగానే అక్కినేని హీరోలు గుర్తొస్తారు. వాళ్లకు ఆ నెలలో మంచి హిట్స్ ఉన్నాయి. మిగతా హీరోల్లో చాలామంది హీరోలు డిసెంబర్ ను ఎవాయిడ్ చేస్తుంటారు. ఈ లిస్ట్ లో నితిన్ కూడా ఉన్నాడు. కావాలంటే అతడు తన సొంత సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ ను వచ్చే ఏడాదికి వాయిదా వేసుకోవచ్చు. అంతా అతడి చేతిలో పని.

కానీ కావాలనే డిసెంబర్ లో రావాలని నిర్ణయించుకున్నాడు ఈ హీరో. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ డిసెంబర్ నెలలో తన సినిమాను రిలీజ్ చేస్తున్న నితిన్, హిట్ కొడితే మాత్రం ఇక ఆ నెలకు దాదాపు ఫిక్స్ అయిపోతాడు. ఇది ఫిక్స్.