వైజాగ్ టీడీపీ…ఆర్ఐపీ …

నిజంగా విమర్శలలో ఇది పీక్స్ అని చెప్పాలి. ఒక పార్టీకే ఏకంగా ఆర్ఐపీ అనడం అంటే దాని తీవ్రత ఏంటో చూడాల్సిందే. అయితే ఈ మాటలు అన్నది ఎవరో కాదు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.…

నిజంగా విమర్శలలో ఇది పీక్స్ అని చెప్పాలి. ఒక పార్టీకే ఏకంగా ఆర్ఐపీ అనడం అంటే దాని తీవ్రత ఏంటో చూడాల్సిందే. అయితే ఈ మాటలు అన్నది ఎవరో కాదు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఆయనకు ఎంతగా ఒళ్ళు మండుకుపోయిందో కానీ వైజాగ్ టీడీపీ ఆర్ఐపీ అంటూ ట్వీట్ చేశారు. ఈ పార్టీ నాయకులు పిచ్చాసుపత్రిలో ఉండాల్సిన వారు అంటూ హాట్ కామెంట్స్ చేశారు.

అసలు విజయసాయిరెడ్డికి ఎందుకంత కోపం వచ్చింది అంటే కధ చాలానే ఉంది. విశాఖ సిటీకి చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి వైసీపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మృతి మీద అనుమానాలు ఉన్నాయంటూ తాజాగా చాలానే  మాట్లాడారు, అంతే కాదు సీబీఐ విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశారు.

ఆయన మీద ఎవరు వత్తిడి చేశారో కూడా ఆ విచారణలో తెలుస్తుంది అని బండారు వారు అభిప్రాయపడ్డారు. నిజంగా ఇది వైసీపీ వారికే కాదు, కామన్ గా ఆలోచించే వారికి కూడా షాక్ లాంటి విమర్శే. గౌతం రెడ్డి మరణం ఎలా సంభవించిందో మినిట్ టూ మినిట్ అంతా కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఆయనకు చికిత్స చేసిన వైద్యులు కూడా ఎలా చనిపోయారో చెప్పుకొచ్చారు. ఇలాంటి మరణాల మీద హృద్రోగ నిపుణులు కూడా ఎలా సంభవిస్తాయో కూడా ఒక వైపు చెప్పుకొస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఈ మరణాన్ని కూడా రాజకీయం చేయడమేంటి అని వైసీపీ నేతలు కస్సుమంటున్నారు.

ఎంతో హుందాగా బతికిన గౌతం రెడ్డి మృతి నుంచి కూడా పొలిటికల్ గా లాభాన్ని ఆలోచించడమేంటని మండిపడుతున్నారు. దీంతోనే విజయసాయిరెడ్డిలో ఆవేశం వచ్చి ట్వీట్ చేశారు. గౌతం రెడ్డి మరణం మీద తప్పుడు ఆరోపణలు చేసిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మానసిక స్థితి మీద కూడా ఆయన డౌట్లు వెలిబుచ్చారు.

ఒక నాయకుడు మరణిస్తే పద్ధతిగా నివాళి అర్పించాల్సింది పోయి దాని మీద కూడా విమర్శలు చేయడం ఒక్క టీడీపీ నేతలకే సాధ్యమని, అందుకే ఆ పార్టీ అందులోని నాయకులు పిచ్చాసుపత్రిలో ఉండాల్సిన వారని విజయసాయిరెడ్డి ట్వీటేశారు. అయితే దీని మీద మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా రీ ట్వీట్ చేస్తూ మీరా మాకు చెప్పేది అంటున్నారు. 

ఏది ఏమైనా కాదేదీ రాజకీయానికి అనర్హం అన్నట్లుగా ఏపీలో రాజకీయం సాగుతోందా అంటూ మేధావులు ముక్కున వేలేసుకునే పరిస్థితి మాత్రం ఏపీలో ఉంది మరి.