రమ్య రఘుపతికి నాకు సంబంధం లేదు – నరేష్

ఆర్థిక మోసాలతో వార్తల్లోకెక్కిన రమ్య రఘుపతిపై, ఆమె మాజీ భర్త, సీనియర్ నటుడు నరేష్ స్పందించారు. రమ్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టంచేశారు. Advertisement “రమ్య రఘుపతి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి…

ఆర్థిక మోసాలతో వార్తల్లోకెక్కిన రమ్య రఘుపతిపై, ఆమె మాజీ భర్త, సీనియర్ నటుడు నరేష్ స్పందించారు. రమ్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టంచేశారు.

“రమ్య రఘుపతి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి 2 రోజులుగా మీడియా నుంచి, మిత్రుల నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. నేను ఒకటే చెబుతున్నాను. నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది జరిగిందనే విషయం కూడా నాకు మొన్నటివరకు తెలియదు. నాకు, రమ్యకు 9 ఏళ్ల కిందట పెళ్లయింది. దాదాపు 5-6 ఏళ్ల కిందటే విడిపోయాం. ఇటువంటి సమస్యలు ఉన్నాయి, ఇవి మరింత పెరుగుతాయనే భయంతోనే మేం విడిపోయాం. నాకు, ఆమెకు ప్రస్తుతం ఎటువంటి సంబంధం లేదు.”

రమ్యతో తనకు ఎలాంటి సంబంధాలు, లావాదేవీలు లేవనే విషయాన్ని 3 నెలల కిందటే పబ్లిక్ నోటీస్ ద్వారా వెల్లడించిన విషయాన్ని ఈ సందర్భంగా పేర్కొన్నారు నరేష్. రమ్యతో తను విడిపోవడానికి కూడా ఇలాంటి ఇష్యూలే కారణమని అన్నారు.

“రమ్య చేస్తున్న వ్యవహారాలపై నాకు కూడా భయమేసింది. అందుకే 3 నెలల కిందటే నేను పబ్లిక్ నోటీస్ కూడా ఇచ్చాను. ఈమెకు, నాకు ఎలాంటి సంబంధం లేదని ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో నోటీసు ఇచ్చాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలీదు. మొన్న మరోసారి ఈ వ్యవహారం వెలుగులోకి రావడం, పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ కూడా రావడంతో నేను మరోసారి దీనిపై వివరణ ఇస్తున్నాను.”

రమ్య ఆర్థిక నేరాల ఇష్యూ ఎక్కడ మునుగుతుందో, ఎక్కడ తేలుతుందో తనకు కూడా తెలియడం లేదని.. తనకు, తన కుటుంబానికి వాళ్ల కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని విస్పష్టంగా ప్రకటించారు నరేష్.

రంభ ఉన్నతి అరోమ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న రమ్య రఘుపతి, కొంతమంది నుంచి అప్పులు తీసుకున్నారు. నరేష్ నుంచి తనకు చాలా ఆస్తి వస్తుందని చెప్పి తమ వద్ద నుంచి అప్పులు తీసుకున్నట్టు బాధితులు వెల్లడించారు. తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో రమ్యపై పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆమెకు తనకు ఎలాంటి సంబంధం లేదని నరేష్ వివరణ ఇచ్చారు.