గర్భవతి ఇలియానా.. గోవా బ్యూటీ ఫుల్ ఫొటోస్

తను గర్భందాల్చిన విషయాన్ని స్వయంగా ప్రకటించింది ఇలియానా. అయితే ఆమె నిజంగానే గర్భందాల్చిందా లేక సరోగసీ ద్వారా తల్లి కాబోతోందా అంటూ చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. ఆ అనుమానాల్ని నివృత్తి చేస్తూ ఈమధ్య…

తను గర్భందాల్చిన విషయాన్ని స్వయంగా ప్రకటించింది ఇలియానా. అయితే ఆమె నిజంగానే గర్భందాల్చిందా లేక సరోగసీ ద్వారా తల్లి కాబోతోందా అంటూ చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. ఆ అనుమానాల్ని నివృత్తి చేస్తూ ఈమధ్య తన బేబీ బంప్ కనిపించేలా కొన్ని ఫొటోలు రిలీజ్ చేసింది ఇలియానా. ఈసారి పూర్తిస్థాయిలో తను గర్భందాల్చిన ఫొటోల్ని ఆమె పోస్ట్ చేసింది.

బంప్ ఎలర్ట్ అంటూ కొద్ది సేపటి కిందట ఇలియానా తను గర్భంతో ఉన్న ఫుల్ లెంగ్త్ ఫొటోల్ని రివీల్ చేసింది. అందులో ఆమె బ్లాక్ డ్రెస్ వేసుకొని ఉంది, ఆమె గర్భం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంట్లో భోజనానికి కూర్చునే ముందు ఇలా ఫొటోలు దిగింది గోవా బ్యూటీ. గర్భంతో ఇలియానా ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే ఇలా ఫొటోలు రిలీజ్ చేసిన వెంటనే అలా మరోసారి ఆమెపై విమర్శల వాన మొదలైంది. తండ్రి ఎవరో చెప్పకుండా ఈ ప్రెగ్నెన్సీ ఫొటోలు పెడితే బ్యాడ్ ఫీలింగ్ వస్తుందంటూ కామెంట్స్ పడుతున్నాయి. ఇలియానా మాత్రం ఈ కామెంట్స్ ను పట్టించుకోవడం లేదు. తన జీవితంలో స్పెషల్ మూమెంట్ ను ఆమె ఎంజాయ్ చేస్తోంది.

టాలీవుడ్ కు ఆమె దాదాపు దూరమైంది. ఇటీవల ఓ హిందీ మ్యూజిక్ వీడియోలో ఆమె కనిపించింది. ఆ వెంటనే తను గర్భం దాల్చినట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ తన ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తోంది ఇల్లీ బేబీ. ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన పిక్స్ పోస్ట్ చేస్తోంది.

Click Here For Photo Gallery