బండ్ల గణేశ్ పొలిటికల్ రీఎంట్రీ

గత ఎన్నికల్లో రాజకీయాల్లోకి వచ్చి, ఓడిపోయిన తర్వాత వెంటనే తప్పుకున్నాడు నిర్మాత కమ్ నటుడు బండ్ల గణేశ్. ఆ తర్వాత ఎన్నో సందర్భాల్లో తను రాజకీయాలకు దూరమని ప్రకటించాడు. తనకు అన్ని పార్టీల్లో ఫ్రెండ్స్…

గత ఎన్నికల్లో రాజకీయాల్లోకి వచ్చి, ఓడిపోయిన తర్వాత వెంటనే తప్పుకున్నాడు నిర్మాత కమ్ నటుడు బండ్ల గణేశ్. ఆ తర్వాత ఎన్నో సందర్భాల్లో తను రాజకీయాలకు దూరమని ప్రకటించాడు. తనకు అన్ని పార్టీల్లో ఫ్రెండ్స్ ఉన్నారని, అందుకే అన్ని పార్టీలతో సమదూరం పాటిస్తానని కూడా చెప్పుకున్నారు.

కట్ చేస్తే, తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ, బండ్ల గణేశ్ మరోసారి తన రాజకీయ పునఃప్రవేశంపై కీలక ప్రకటన చేశారు. తను మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించాడు ఈ నిర్మాత.

“రాజకీయాలంటే నిజాయితీ. రాజకీయాలంటే నీతి. రాజకీయాలంటే కష్టం. రాజకీయాలంటే పౌరుషం. రాజకీయాలంటే శ్రమ. రాజకీయాలంటే పోరాటం. ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి, రావాలి. అందుకే వస్తా”

ఇలా తన పొలిటికల్ రీఎంట్రీపై విస్పష్టంగా ప్రకటన చేశారు బండ్ల గణేశ్. అయితే అతడు ఈసారి ఏ పార్టీలోకి వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోసారి కాంగ్రెస్ లోనే కొనసాగుతారా లేక బీఆర్ఎస్ లోకి వెళ్తారా అనేది వేచి చూడాలి.

బండ్ల గణేశ్ ఇలా తన రాజకీయ పునఃప్రవేశంపై ప్రకటన చేసిన వెంటనే అలా ఆయనపై ట్రోలింగ్ షురూ అయింది. “అన్నా, సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ కొనుక్కోమంటావా” అంటూ లెక్కలేనన్ని పోస్టులు పడుతున్నాయి. గతంలో తను ఓడిపోయే సెవెన్ ఓ క్లాస్ బ్లేడ్ తో కోసుకుంటూనంటూ బండ్ల సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దాన్ని ఇప్పుడు నెటిజన్లు మరోసారి గుర్తుచేస్తున్నారు.