సర్కార్ స్కూల్ తలెత్తుకుంది…!

ప్రభుత్వ పాఠశాలలు పాస్ ఫెయిల్ ఈ రెండింటి మధ్యనే తిరిగుతూంటాయి. ఫెయిల్ అయితే ప్రభుత్వ బడులు అంతే అంటారు. పాస్ అయితే అంతకు మించి ఏముంటుందని సులువుగా అనేస్తారు. అంతే తప్ప ర్యాంకులు వస్తాయని…

ప్రభుత్వ పాఠశాలలు పాస్ ఫెయిల్ ఈ రెండింటి మధ్యనే తిరిగుతూంటాయి. ఫెయిల్ అయితే ప్రభుత్వ బడులు అంతే అంటారు. పాస్ అయితే అంతకు మించి ఏముంటుందని సులువుగా అనేస్తారు. అంతే తప్ప ర్యాంకులు వస్తాయని ఆశించడం అత్యాశగానే చూస్తారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలలకు ప్రాధాన్యత ఇస్తోంది. విద్యా రంగానికి బడ్జెట్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మొత్తాలను నిధులుగా కేటాయిస్తోంది. వైసీపీ ఏలుబడిలో నాలుగేళ్ల తరువాత వాటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఈసారి పదవ తరగతి పరీక్షలలో మంచి రిజల్ట్స్ వచ్చాయి. అయిదు యభైకి పైబడి ఎన్నో ర్యాంకులు వచ్చాయి.

ఇదిలా ఉండగా పదవతరగతిలో 570 కంటే ఎక్కువ మార్కులు సాధించి ర్యాంకులను దక్కించుకున్న విశాఖ జిల్లా విద్యార్ధులకు జిల్లా కలెక్టర్ మల్లికార్జున అద్భుతమైన బహుమతి ఇచ్చారు. వారందరితో కలసి ఆయన లంచ్ చేస్తూ వారి కళ్లలో ఆనందం నింపారు. 

ప్రభుత్వ పాఠశాలలు అంటే ర్యాంకులు రావు అనుకునే పరిస్థితి నుంచి కలెక్టర్ తో కలసి భోజనం చేసే దాకా ఈ పేద విద్యార్ధులు మారుమూల పల్లెటూరి పిల్లలూ వెళ్లారు అంటే ఆ గొప్పదనం కచ్చితంగా జగన్ ది కాకుండా ఉంటుందా. అందుకే జగన్ గ్రేట్ అనాల్సిందే.