బాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన అగ్రహీరోయిన్ ప్రియాంక చోప్రా. హాలీవుడ్‌లో సైతం అగ్రహీరోయిన్‌గా రాణిస్తూ తనకంటే పదేళ్లు చిన్నవాడైన నిక్‌జొనాస్‌ను ప్రేమలో పడ్డారు. అనంతరం వాళ్లిద్దరి ప్రేమ పెద్దల ఆమోదంతో 2018లో పెళ్లిపీటలెక్కింది.
ఎంతో గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో ప్రియాంక చోప్రా గొడవ పడ్డారు . అది కూడా లండన్ వీధుల్లో కావడం విశేషం. ఇంతకూ వాళ్లిద్దరి మధ్య గొడవకు గల కారణాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? అయితే కథనంలోకి పదండి పోదాం.
అందం, అభినయం పోటీ పడేలా ఉండడం ప్రియాంక చోప్రా ప్రత్యేకత. బాలీవుడ్ అగ్రతారగా వెలుగొందుతున్న ప్రియాంక ‘క్వాంటికో’ సిరీస్‌తో హాలీవుడ్‌లో సైతం అదేస్థాయి గుర్తింపు పొందారు. ఇటు బాలీవుడ్, అటు హాలీవుడ్‌కు పేరుకు తగ్గట్టే ప్రియమైన కథానాయికగా ప్రియాంక చోప్రా మారారు.
ఈ నేపథ్యంలో లండన్ వీధుల్లో తనకిష్టమైన భర్తతో వాగ్వాదం చేస్తూ ప్రియాంక కెమెరాకెక్కారు. అయితే ఇది రియల్ గొడవని ఎవరైనా నమ్మితే పప్పులో కాలేసినట్టే. ప్రియాంక, ఆమె భర్త మధ్య గొడవ రీల్‌లైఫ్‌లోనిది.
ప్రస్తుతం ప్రియాంక ‘టెక్ట్స్ ఫర్ యూ’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులో ప్రియాంక భర్త నిక్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు. తాజాగా వీరిద్దరి మధ్య సన్నివేశాల చిత్రీకరణ లండన్‌లో సాగుతోంది.
ఇందులో భాగంగా కారులో ప్రయాణిస్తున్న ప్రియాంక-నిక్ పరస్పరం గొడవ పడతారు. ఈ సందర్భంగా తన కారు నుంచి దిగిపోవాలని నిక్‌ను ఆమె ఆదేశిస్తారు. ఇదన్న మాట ప్రియాంక -నిక్ మధ్య గొడవ కథ. ఈ సీన్ల చిత్రీకరణ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.