ఎయిర్ పోర్ట్ డాన్స్ పై సమంత క్లారిటీ

ఉన్నట్టుంది ఎయిర్ పోర్టులో చిందులేసింది సమంత. దానికి సంబంధించిన వీడియోను కూడా తన సోషల్ మీడియా ఎకౌంట్ లో పోస్ట్ చేసింది. బీస్ట్ సినిమా కోసం అనిరుధ్ కంపోజ్ చేసిన పాట అది. తాజాగా…

ఉన్నట్టుంది ఎయిర్ పోర్టులో చిందులేసింది సమంత. దానికి సంబంధించిన వీడియోను కూడా తన సోషల్ మీడియా ఎకౌంట్ లో పోస్ట్ చేసింది. బీస్ట్ సినిమా కోసం అనిరుధ్ కంపోజ్ చేసిన పాట అది. తాజాగా ఈ డాన్స్ పై స్పందించింది సమంత. అది అనుకోకుండా అలా జరిగిపోయిందని చెప్పుకొచ్చింది.

విజయ్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోంది బీస్ట్ అనే సినిమా. ఈ సినిమాకు అనిరుధ్ సంగీత దర్శకుడు. సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను తాజాగా విడుదల చేశారు. అరబిక్ స్టయిల్ లో కంపోజ్ చేసిన ఈ పాట పెద్ద హిట్టయింది. చాలామంది సెలబ్రిటీలు ఈ పాటకు డాన్స్ చేస్తూ, ఆ వీడియోల్ని పోస్ట్ చేస్తున్నారు.

ఎయిర్ పోర్ట్ లో ఉన్న సమంత అనుకోకుండా ఈ వీడియో చూసింది. వెంటనే తనకు కూడా డాన్స్ చేయాలని అనిపించిందట. అనుకున్నదే తడవుగా అప్పటికప్పుడు ఆ స్టెప్పుల్ని వేశానని, ఆ పాట తనకు అంత బాగా నచ్చిందని చెప్పుకొచ్చింది సమంత. అది ప్లాన్ చేసి చేసిన డాన్స్ కాదని స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇక వీడియో విషయానికొస్తే పూజాహెగ్డే అందాలు, విజయ్ స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.