‘భీమ్లా’ హిందీ వెర్షన్ ఇప్పుడు కాదు

పుష్ప సినిమా హిందీ వెర్షన్ ఎంత ట్రబుల్స్ లో విడుదలయిందో అంతకు అంతా సక్సెస్ సాధించింది. అసలు హిందీ వెర్షన్ విడుదలే వుండదు అనుకుంటే, పట్టుదలతో విడుదల చేసారు.  Advertisement పబ్లిసిటీకి టైమ్ లేదు…

పుష్ప సినిమా హిందీ వెర్షన్ ఎంత ట్రబుల్స్ లో విడుదలయిందో అంతకు అంతా సక్సెస్ సాధించింది. అసలు హిందీ వెర్షన్ విడుదలే వుండదు అనుకుంటే, పట్టుదలతో విడుదల చేసారు. 

పబ్లిసిటీకి టైమ్ లేదు అనుకుంటే కిందా మీదా పడ్డారు. కానీ ఆ సినిమాను అందులో పాటలు ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. నార్త్ బెల్డ్ లో గల్లీ గల్లీలో పుష్ప పాటలు మారుమోగిపోయాయి. ఇప్పటికీ మారు మోగుతున్నాయి.

ఇది చూసి తెలుగు భారీ సినిమాలు అన్నీ ఛలో హిందీ రిలీజ్ అన్నాయి. భీమ్లా, ఆచార్య కూడా హిందీ మేము సైతం అనేసాయి. ఈ లోగా ఖిలాడీ సినిమా హిందీలో విడుదలయింది. పోస్టర్ ఖర్చులు కూడా రాబట్టుకోలేదు. 

ఇలాంటి నేపథ్యంలో భీమ్లా నాయక్ విడుదల దగ్గరకు వచ్చింది. కానీ ఇప్పటి వరకు హిందీ వెర్షన్ కు సంబంధించి ఓ పాట లేదు..వీడియో లేదు.

ప్రోపర్ పబ్లిసిటీతో ఓ వారం తరువాత విడుదల చేద్దామని మేకర్లు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వన్ వీక్ తరువాత భీమ్లా హిందీ వెర్షన్ విడుదల ప్లానింగ్ వుందని తెలుస్తోంది. నిజానికి అన్ని తెలుగు సినిమాలు హిందీకి సెట్ కావు. పుష్పకు ఏదో అలా వర్కవుట్ అయింది. అంతే.