గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ.. బాలయ్యకు మోక్షజ్ఞ వార్నింగ్

“గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే”… భగవంత్ కేసరి సినిమాలో విలన్ కు బాలయ్య ఇచ్చిన వార్నింగ్ ఇది. మరి నిజజీవితంలో బాలయ్యకు అలాంటి వార్నింగ్ ఎదురైతే ఎలా ఉంటుంది? స్వయంగా అతడి కన్నకొడుకు నుంచే…

“గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే”… భగవంత్ కేసరి సినిమాలో విలన్ కు బాలయ్య ఇచ్చిన వార్నింగ్ ఇది. మరి నిజజీవితంలో బాలయ్యకు అలాంటి వార్నింగ్ ఎదురైతే ఎలా ఉంటుంది? స్వయంగా అతడి కన్నకొడుకు నుంచే అలాంటి డైలాగ్ వినిపిస్తే ఎలా ఉంటుంది? నీకు గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా నాన్నా అని మోక్షజ్ఞ అన్నాడట. స్వయంగా బాలకృష్ణ ఈ మేటర్ చెప్పుకొచ్చాడు.

“ఈరోజు పొద్దున్నే శ్రీలీలతో ఓ మాట అన్నాను. ఇద్దరం కలిసి నటించాం సరే. నువ్వు చిచ్చా…చిచ్చా అని నన్ను టార్చర్ పెట్టావ్. నెక్ట్స్ సినిమాలో మనం హీరోహీరోయిన్లుగా నటిద్దామని చెప్పాను. ఇదే మాట ఇంటికెళ్లి మా కుటుంబ సభ్యులతో చెప్పాను. నా కొడుకు మోక్షజ్ఞకు కోపమొచ్చింది. ఏం డాడీ, నేను హీరోగా రాబోతున్నాను, నువ్వు ఆవిడకు ఆఫర్ ఇస్తానంటావేంటి? నీకు గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ అన్నాడు. నాకు కాసేపు అర్థంకాలేదు. నన్ను అంత మాట అన్నాడేంటని అర్థంకాలేదు.”

ఇలా తన కొడుకు, తనకు వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని బయటపెట్టాడు బాలయ్య. భగవంత్ కేసరి ట్రయిలర్ లాంఛ్ ఈవెంట్ లో మాట్లాడుతూ, బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో స్టేజ్ పై అంతా ఫక్కున నవ్వేశారు.

బాలయ్య అంతే.. నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తాడు.. తర్వాత నవ్వులుపాలవుతాడు. ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు కూడా అలాంటివే. ఫ్లోలో ఏదో అనేశాడు. ట్రోలర్స్ కు కావాల్సినంత స్టఫ్ అందించాడు.