యువి జాక్ పాట్

యువి క్రియేషన్స్ జాక్ పాట్ కొట్టింది. ప్రభాస్ తో చిరకాల స్నేహం, యువి వంశీ, విక్కీలతో ప్రభాస్ కు వున్న సాన్నిహిత్యం వారికి ఈ జాక్ పాట్ అందించింది.  Advertisement ప్రభాస్ ను బాహుబలి…

యువి క్రియేషన్స్ జాక్ పాట్ కొట్టింది. ప్రభాస్ తో చిరకాల స్నేహం, యువి వంశీ, విక్కీలతో ప్రభాస్ కు వున్న సాన్నిహిత్యం వారికి ఈ జాక్ పాట్ అందించింది. 

ప్రభాస్ ను బాహుబలి తరువాత మరింత లెవెల్ లో నిల్చోపెట్టాలని తపన పడ్డారు వంశీ, విక్కీ,. అందుకే సాహో సినిమా చేసారు. ఆ సినిమా బాలీవుడ్ లో 100 కోట్లు వసూలు చేసింది. 

సినిమా మంచి చెడ్డలు ఎలా వున్నా ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ గా ఫిక్స్ చేసేసింది. అయితే యువి మాత్రం కాస్త ఒడిదుడుకుల్లో పడింది. అయితే ఆదిపురుష్ సినిమాతో డీల్ అందించడం ద్వారా ప్రభాస్ వారిని మళ్లీ లైన్ లో పెట్టేసారు. 

ఇంతకీ విషయం ఏమిటంటే, ఆదిపురుష్ కర్ణాటక, నైజాం, ఆంధ్ర, సీడెడ్ హక్కులు యువి కి అందించారు. అందుకు గాను 75 కోట్లు రేటు ఫిక్స్ చేసారు.

ప్రభాస్ సినిమా నైజాం, ఆంధ్ర, సీడెడ్, కర్ణాటకు 75 కోట్లకు రావడం అంటే జాక్ పాట్ కొట్టినట్లే. అలా అలా మార్కెట్ చేసినా 50 కోట్ల మేరకు మిగులుతాయని ఇండస్ట్రీ టాక్. ఫ్రెండ్ షిప్ అంటే అలా వుండాలేమో?

బిగ్ బాస్ విన్న‌ర్ ఎవ‌రో నాకు తెలుసు