దాదాపు 99శాతం మంది హీరోలు ఫస్ట్ సిట్టింగ్ లో స్టోరీని ఓకే చేయరు. చాలా కథాచర్చలు నడుస్తాయి, మరెన్నో మార్పులు జరుగుతాయి. ఆ తర్వాత మాత్రమే స్టోరీ లాక్ అవుతుంది, సినిమా ఎనౌన్స్ అవుతుంది. పాయింట్ విపరీతంగా నచ్చి, లేదా దర్శకుడిపై ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఫస్ట్ సిట్టింగ్ లోనే ఓకే చెప్పి ఫ్లాపులు తెచ్చుకున్న హీరోలున్నారు, అదే టైమ్ లో హిట్స్ కొట్టిన హీరోలు కూడా ఉన్నారు. మరి నాగచైతన్య ఏ కోవలోకి వెళ్తాడు?
ఫస్ట్ సిట్టింగ్ లోనే ఓకే చెప్పి నాగచైతన్య చేసిన సినిమా కస్టడీ. ఈ విషయాన్ని అతడు స్వయంగా ప్రకటించాడు. ఫస్ట్ నెరేషన్ లోనే దర్శకుడు వెంకట్ ప్రభును కౌగిలించుకొని సినిమాకు ఓకే చెప్పాడట. మరి చైతూ తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
ఇలా ఫస్ట్ సిట్టింగ్ లోనే ఓకే చెప్పి ఫ్లాపులు తెచ్చుకున్న హీరోలున్నారు, హిట్స్ ఇచ్చిన హీరోలు కూడా ఉన్నారు. ఉదాహరణకు శక్తి సినిమానే తీసుకుంటే, ఈ సినిమా కథకు ఫస్ట్ సిట్టింగ్ లోనే ఓకే చెప్పాడు ఎన్టీఆర్. అది డిజాస్టర్ అయింది. ఇక పోకిరి సినిమాను తీసుకుంటే, ఈ కథకు కూడా ఫస్ట్ సిట్టింగ్ లోనే ఓకే చెప్పాడు మహేష్. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది.
సో.. ఫస్ట్ సిట్టింగ్ లోనే ఓకే చెబితే ఫ్లాప్ అవుతుందని చెప్పలేం, అలా అని హిట్ అవుతుందని కూడా అనలేం. కాకపోతే ఇలా సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేసి చేసిన సినిమాల్లో ఫ్లాపులే ఎక్కువ.
నాగచైతన్య మాత్రం ఈసారి తన జడ్జ్ మెంట్ గురితప్పదంటున్నాడు. ఎడిటింగ్ టేబుల్ పై సినిమా చూసినప్పుడే థ్యాంక్యూ సినిమా ఫ్లాప్ అవుతుందని ఊహించానని వెల్లడించిన ఈ హీరో… కస్టడీ సినిమాను రీ-రికార్డింగ్ తో పాటు చూసి కచ్చితంగా హిట్ అవుతుందని చెబుతున్నాడు.