పెళ్లి త‌ర్వాత అవ‌కాశాల‌పై…అమ్మ‌డి మ‌న‌సులో మాట‌

స‌హజంగా పెళ్లి త‌ర్వాత హీరోయిన్ల‌కు పెద్దగా అవ‌కాశాలు రావ‌ని అంటారు. ఇది చాలా వ‌ర‌కూ నిజం కూడా. కానీ పెళ్లి త‌ర్వాత కూడా అద్భుతంగా రాణిస్తున్న క‌థానాయిక‌గా స‌మంత గుర్తింపు పొందారు. తాజాగా స‌మంత…

స‌హజంగా పెళ్లి త‌ర్వాత హీరోయిన్ల‌కు పెద్దగా అవ‌కాశాలు రావ‌ని అంటారు. ఇది చాలా వ‌ర‌కూ నిజం కూడా. కానీ పెళ్లి త‌ర్వాత కూడా అద్భుతంగా రాణిస్తున్న క‌థానాయిక‌గా స‌మంత గుర్తింపు పొందారు. తాజాగా స‌మంత ఓ టాక్‌షో చేస్తూ ప్రేక్షకుల్ని ఆక‌ట్టుకుంటున్నారు. 

ఇటీవ‌ల బిగ్‌బాస్ రియాల్టీ షోకు ఓ వారం హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించి శ‌భాష్ అనిపించుకున్నారు. ప్ర‌స్తుతం ఆమె చేస్తున్న టాక్‌షోలో పెళ్లి త‌ర్వాత అవ‌కాశాల‌పై ఆమె ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట పెట్టారు. 

పెళ్లి త‌ర్వాత కూడా మంచి పాత్ర‌ల్లో న‌టిస్తున్నానంటే అదంతా త‌న అదృష్టమ‌ని ఆమె అభిప్రాయం. సుదీర్ఘ ప్రేమ ప్ర‌యాణం అనంత‌రం అక్కినేని నాగచైతన్య, సమంత పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది అక్టోబ‌ర్ 6వ తేదీతో మూడేళ్ల వివాహ బంధాన్ని పూర్తి చేసుకున్నారు. 

పెళ్లి త‌ర్వాత కూడా టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా స‌మంత కొన‌సాగుతున్నారు. టాలీవుడ్‌లో బెస్ట్ క‌పుల్‌గా చైత‌న్య‌-స‌మంత జంట గుర్తింపు పొందింది. కాగా టాక్‌షోలో ఆమె పెళ్లి త‌ర్వాత కెరీర్‌పై వెల్ల‌డించిన అభిప్రాయాలు ఆలోచించేలా ఉన్నాయి.  

పెళ్లి అనేది హీరోయిన్ల కెరీర్‌కు పెద్ద అడ్డంకి కాద‌ని నిరూపించాల‌నో, లేక అలాంటి అపోహ‌ను తొల‌గించాల‌నే ఆలోచ‌న‌తో కెరీర్‌ను తాను ప్రారంభించ‌లేద‌ని ఆమె చెప్పుకొచ్చారు. పెళ్లి త‌ర్వాత ఇక ఎంత మాత్రం త‌న‌కు అవ‌కాశాలు రావ‌నే అనుకున్న‌ట్టు స‌మంత చెప్పుకొచ్చారు. 

సినిమా అవ‌కాశాలు రావ‌నుకునే పెళ్లికి కూడా సిద్ధ‌ప‌డిన‌ట్టు ఆమె మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టి ఆశ్చ‌ర్య ప‌రిచారు. కానీ, త‌న వైపు అదృష్టం ఉంద‌ని ఆమె ఆనందంగా అన్నారు. పెళ్లి తర్వాత ‘రంగస్థలం’, ‘మహానటి’ లాంటి గొప్ప సినిమాల్లో న‌టించే అవ‌కాశాలు వ‌చ్చాయ‌ని స‌మంత అన్నారు. 

అలాగే  ‘ఓ బేబీ’తో మెప్పించాన‌న్నారు.  కేవ‌లం ఇందతా త‌న‌కు  అదృష్టం వ‌ల్ల ద‌క్కిన అవ‌కాశాలుగానే స‌మంత చెప్ప‌డం ఆమె విన‌య‌విధేయ‌త‌ల‌కు నిద‌ర్శ‌న‌మ‌ని అభిమానులు చెబుతున్నారు.  

ఈ సెగ దేశం మొత్తానికి పాకుతుందా?