‘మలినేని’ మళ్లీ ‘రీమేక్’?

క్రాక్ సినిమాతో హిట్ కొట్టారు గోపీచంద్ మలినేని. అయితే ఓ తమిళ సినిమా రైట్స్ ను నిర్మాత టాగోర్ మధు కొని దగ్గర పెట్టుకుని, దాని థ్రెడ్ కు స్టోరీ అల్లించడం ద్వారా ఓ…

క్రాక్ సినిమాతో హిట్ కొట్టారు గోపీచంద్ మలినేని. అయితే ఓ తమిళ సినిమా రైట్స్ ను నిర్మాత టాగోర్ మధు కొని దగ్గర పెట్టుకుని, దాని థ్రెడ్ కు స్టోరీ అల్లించడం ద్వారా ఓ మాంచి కథ సెట్ అయింది. దానికి గోపీచంద్ మార్క్ సీన్లు, యాక్షన్ సీన్లు పడ్డాయి. హిట్ దొరికింది.

బాలయ్యతో మలి సినిమా చేస్తున్నారు గోపీచంద్ మలినేని. ఈ సినిమా విషయంలో కూడా క్రాక్ ఫార్ములానే ఫాలో అవుతున్నారని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. 

కన్నడంలో హిట్ అయిన మఫ్టీ సినిమా థ్రెడ్ తీసుకుని గోపీచంద్ మలినేని తన స్టయిల్ కథనాన్ని తయారుచేసినట్లు తెలుస్తోంది. 

అయితే అది వాస్తవం కాదని స్ట్రయిట్ సినిమానే అని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నారు. ఎంత వరకు నిజం అన్నది, ఏది వాస్తవం అన్నది సినిమా బయటకు వచ్చే వరకు తెలియదు. అంతవరకు గ్యాసిప్ ల్లోనే ఉంటుంది.