సాయిపల్లవి ట్రాజెడీ క్లయిమాక్స్ లు

క్రేజీ హీరోయిన్ సాయిపల్లవి ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. రానాతో విరాటపర్వం, నానితో శ్యామ్ సింఘ రాయ్. ఈ రెండు సినిమాల్లో కూడా ట్రాజెడీ క్లయిమాక్స్ లే వుంటాయని వినిపిస్తోంది.  Advertisement అయితే…

క్రేజీ హీరోయిన్ సాయిపల్లవి ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. రానాతో విరాటపర్వం, నానితో శ్యామ్ సింఘ రాయ్. ఈ రెండు సినిమాల్లో కూడా ట్రాజెడీ క్లయిమాక్స్ లే వుంటాయని వినిపిస్తోంది. 

అయితే శ్యామ్ సింఘ రాయ్ ప్రాజెక్టు చేతులు మారడం వెనుక కూడా ఈ పాయింట్ వుందని, అందువల్ల ఇప్పుడు దాన్ని మార్చే ఆలోచన కూడా వుందని వినిపిస్తోంది.

విరాటపర్వంలో హీరోయిన్ ను హీరోనే కాల్చి చంపేస్తాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అలాగే శ్యామ్ సింఘ రాయ్ లో హీరోయిన్ హీరో ఒడిలోనే కన్ను మూస్తుందని వినిపిస్తోంది. ఈ లెక్కన యాంటీ క్లయిమాక్స్ వుంటే చాలు సాయిపల్లవి ఛాయిస్ అవుతోందేమో అనిపిస్తోంది.

అయితే నాగ్ చైతన్య-శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ మూవీలో మాత్రం అంతా హ్యాపీ ఎండింగ్ ఇంకా రొమాటింక్ ఎంటర్ టైన్ మెంటే. 

అటూ ఇటూ ఎటూ కాలేక!