ప్రియుడి కోసం న‌ర్సు పాడు ప‌ని

ప్రేమ గుడ్డిదంటారు. ప్రియుడి కోసం ఓ ప్రియురాలు క‌నీస విచ‌క్ష‌ణ లేకుండా ఓ పాడు ప‌నికి తెగ‌బ‌డింది. తోటి ఉద్యోగిని బాత్‌రూంలో స్నానం చేస్తుండ‌గా, ఆ దృశ్యాల‌ను వీడియో తీసి ప్రియుడికి పంపింది. ఈ…

ప్రేమ గుడ్డిదంటారు. ప్రియుడి కోసం ఓ ప్రియురాలు క‌నీస విచ‌క్ష‌ణ లేకుండా ఓ పాడు ప‌నికి తెగ‌బ‌డింది. తోటి ఉద్యోగిని బాత్‌రూంలో స్నానం చేస్తుండ‌గా, ఆ దృశ్యాల‌ను వీడియో తీసి ప్రియుడికి పంపింది. ఈ ఘ‌ట‌న బెంగ‌ళూరులో చోటు చేసుకొంది. స‌ద‌రు ప్రియురాలు ఓ న‌ర్సు. 

ఈ త‌ప్పుడు ప‌ని వెలుగు చూడ‌డంతో నర్సు క‌ట‌క‌టాల పాలు కావాల్సి వ‌చ్చింది. వైట్ ఫీల్డ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో ఓ యువ‌తి న‌ర్సుగా ప‌నిచేస్తోంది. అత్య‌వ‌స‌ర సేవ‌ల విభాగంలో ఆమె విధులు నిర్వ‌ర్తిస్తోంది. 

ఎమ‌ర్జెన్జీ విభాగంలో ప‌ని చేసే న‌ర్సుల‌కు ఆస్ప‌త్రి యాజ‌మాన్యం హాస్ట‌ల్ వ‌స‌తి సౌకర్యాన్ని క‌ల్పించింది. ఈ నెల 5న సాయంత్రం ఓ న‌ర్సు త‌న గ‌దిలో స్నానం చేస్తుండ‌గా బాత్రూంలో మొబైల్ కంట‌ప‌డింది. ఒక్క‌సారిగా షాక్ గురైన స‌ద‌రు బాధితురాలు ….దాన్ని ప‌రిశీలించింది.

తన స్నాన‌పు దృశ్యాలు రికార్డు కావ‌డాన్ని గుర్తించి భ‌యాందోళ‌న‌కు గురైంది. ఈ విష‌య‌మై హాస్ట‌ల్ ఇన్‌చార్జ్‌కు ఫిర్యాదు చేసింది. ఆ సెల్‌ఫోన్ ప్రేమ కార్య‌క‌లాపాలు సాగిస్తున్న న‌ర్సుద‌ని గుర్తించారు. దీంతో ఆమెను విచారించ‌డంతో అస‌లు విష‌యం బ‌య‌టికొచ్చింది. 

ప్రియుడి కోసం తాను త‌ప్పుడు ప‌నికి ఒడిగ‌ట్టిన‌ట్టు ఆమె ఒప్పుకొంది. ఈ నేప‌థ్యంలో వైట్‌ఫీల్డ్ ఫోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. పాడు ప‌నికి ఉసిగొల్పిన ప్రియుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు.  

అటూ ఇటూ ఎటూ కాలేక!