థమన్-రవితేజ-అనిరుధ్

సంగీత దర్శకుడు థమన్ మాంచి ఫామ్ లో వున్నారు. టాగోర్ మధు నిర్మిస్తున్న రవితేజ క్రాక్ సినిమాకు థమన్ నే సంగీత దర్శకుడు. ఈ సినిమా కోసం రవితేజ మార్కు హీరోయిన్ టీజింగ్ సాంగ్…

సంగీత దర్శకుడు థమన్ మాంచి ఫామ్ లో వున్నారు. టాగోర్ మధు నిర్మిస్తున్న రవితేజ క్రాక్ సినిమాకు థమన్ నే సంగీత దర్శకుడు. ఈ సినిమా కోసం రవితేజ మార్కు హీరోయిన్ టీజింగ్ సాంగ్ ను థమన్ వైవిధ్యంగా తయారుచేసారు. 

ఈ పాటను తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ పాడడం ఓ వెరైటీ పాయింట్ అయితే, పాటకు క్లాసికల్ కీర్తనను మిక్స్ చేసి చేయడం మరో వెరైటీ పాయింట్.

రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ గీతం క్లాసికల్ కీర్తనతో ప్రారంభం అవుతూనే, ఒప్పులకుప్ప.. వయ్యారిభామా.. ఒకటేసారి పుట్టదు ప్రేమ..డేటింగ్ గీటింగ్ మొదలెడదామా? అంటూ హీరోయిన్ టీజ్ చేసే మాటలతో ముందుకు సాగి,  ఆకారం చూస్తే అబ్బబ్బో..అవతారం చూస్తే అబ్బబ్బో..అంటూ లెంగ్తీ ఇంట్రడక్షన్ తో పాటలకి తీసుకెళ్లి బల్లేగా తగిలేవే బంగారం అనే హుక్ లైన్ కు చేరుకుంటుంది. 

థమన్ చేసిన ఈ వైవిధ్యమైన సాంగ్ కు పూర్తి విజువల్స్ తోడయితే కచ్చితంగా క్రాక్ సినిమాకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అనే వుంది.