జీవీఎల్‌లో బండి సంజ‌య్ పూన‌కం

బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ నర‌సింహారావు సంచ‌ల‌న హెచ్చ‌రిక చేశారు. తిరుప‌తిలో ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ‌లో ఒక స‌ర్జిక‌ల్ స్ట్రైక్ చేస్తే, ఏపీలో రెండు స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేస్తామ‌ని వ్యాఖ్యానించారు. Advertisement…

బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ నర‌సింహారావు సంచ‌ల‌న హెచ్చ‌రిక చేశారు. తిరుప‌తిలో ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ‌లో ఒక స‌ర్జిక‌ల్ స్ట్రైక్ చేస్తే, ఏపీలో రెండు స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేస్తామ‌ని వ్యాఖ్యానించారు.

జీవీఎల్‌లో తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పూన‌కం వ‌చ్చిన‌ట్టు మాట్లాడ్డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

తెలంగాణ‌లో ఒక స‌ర్జిక‌ల్ స్ట్రైక్ అంటే అధికార పార్టీ టీఆర్ఎస్‌ను ఓడించ‌డం అని, అదే ఏపీలో రెండు స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ అంటే బ‌ల‌మైన పాల‌క ప్ర‌తిప‌క్ష పార్టీలైన వైసీపీ, టీడీపీల‌ను మ‌ట్టిక‌రిపించ‌డ‌మ‌నే అర్థంలో జీవీఎల్ వ్యాఖ్య‌ల‌ను చూడాలంటున్నారు. 

జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ  తిరుపతి ఉప ఎన్నికలో జనసేనతో  కలిసి పోటీ చేస్తామని  జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. రెండు పార్టీల‌కు బుద్ధి చెబుతామ‌ని హెచ్చ‌రించారు. రాష్ట్రాభివృద్ధిలో కేంద్రం నిధులున్నాయ‌ని, పెట్టుబ‌డి అంతా న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వానిదే అని జీవీఎల్ అన్నారు. 

గతంలో పాలించిన‌ టీడీపీని, ఇప్పటి వైసీపీ సర్కార్‌కు ఛాలెంజ్ చేస్తున్నామని, వాళ్లు చేసిన అభివృద్ధి ఏంటో  తిరుపతి వేదికగా సమాధానం చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.

లౌకిక పార్టీల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయ‌న ఆరోపించారు. దేవాలయాలే దండగన్న మహానుభావుడు చంద్రబాబు అని.. ఆయన కూడా హిందూయిజం గురించి మాట్లాడుతున్నారని జీవీఎల్ ఎద్దేవా చేశారు. 

తిరుప‌తి ఉప ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని అధికార ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై బీజేపీ ఘాటు విమ‌ర్శ‌లు చేస్తున్నా … ఆ రెండు పార్టీలు ఏ మాత్రం ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

అటూ ఇటూ ఎటూ కాలేక!