ఏం చేస్తున్నారు..రావిపూడి?

అఖండ సినిమా..ఆ ఊపులో వచ్చిన వీర సింహారెడ్డి సినిమాలను పక్కన పెడితే బాలయ్య సినిమాల బిజినెస్ ఎంత? బాలయ్య సినిమాల బడ్జెట్ ఎంత? పోనీ ఇప్పుడు బాగా పెరిగింది.  Advertisement అన్నీ కలిపి 100…

అఖండ సినిమా..ఆ ఊపులో వచ్చిన వీర సింహారెడ్డి సినిమాలను పక్కన పెడితే బాలయ్య సినిమాల బిజినెస్ ఎంత? బాలయ్య సినిమాల బడ్జెట్ ఎంత? పోనీ ఇప్పుడు బాగా పెరిగింది. 

అన్నీ కలిపి 100 కోట్ల మార్కెట్ వుంది అనుకున్నా, ఖర్చు చేయాల్సింది ఏ మేరకు? ఇన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి, బాలయ్య-అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ సంగతులు తెలుసుకుంటే ఇలాంటి డౌట్ లు చాలా వస్తాయి.

ప్రస్తుతం ఈ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ ఫైట్ ను షూట్ చేస్తున్నారు. ఒక్క ఫైట్ కోసం వేసుకున్న షెడ్యూలు దాదాపు ఇరవై రోజులు. . రోజుకు కనీసంలో కనీసం 20 లక్షలు షూటింగ్ ఖర్చు. అంటే అక్కడికే 4 కోట్లు. ఆపై భారీ సెట్. ఎక్సట్రా..ఎక్సట్రా. అంటే కేవలం ఇంటర్వెల్ ఫైట్ కోసం దాదాపు 6 కోట్లు ఖర్చు అన్నమాట. ఇప్పటికే జైలు సెట్ భారీగా వేసి అందులో వారం రోజుల పాటు ఓ ఫైట్ చిత్రీకరించారు.

కనీసం మరో రెండు అన్న భారీ ఫైట్లు వుండే వుంటాయి. స్టార్ కాస్ట్, అన్నీ కలిపి 100 కోట్లను దాటేస్తుంది బడ్జెట్ అని అంచనా. మరి ఇలా అయితే నిర్మాత కు ఏం మిగులుస్తారో? బాలయ్యతో సినిమా చేసాం అన్న హ్యపీనెస్ ఒక్కటే సరిపోదు కదా.  వంద కోట్లకు పైగా ఖర్చు చేసిన సినిమాకు ఒకటో రెండో కోట్లు లాభం అన్నా వుంటే సంతోషం. లేదంటే బాధగా వుంటుంది.