మోస్ట్ అవైటింగ్ ట్రయిలర్ ఆఫ్ ది ఇయర్

ఇలా అనడానికి అన్ని అర్హతులు వున్నాయనే అనుకోవాలి ఆదిపురుష్ ట్రయిలర్ విషయంలో. ప్రతి సినిమా ట్రయిలర్ కోసం ఎంతో కొంత మంది వేచి వుంటారు. అది వాస్తవం. ఆ సినిమా హీరోకి వుండే ఫ్యాన్…

ఇలా అనడానికి అన్ని అర్హతులు వున్నాయనే అనుకోవాలి ఆదిపురుష్ ట్రయిలర్ విషయంలో. ప్రతి సినిమా ట్రయిలర్ కోసం ఎంతో కొంత మంది వేచి వుంటారు. అది వాస్తవం. ఆ సినిమా హీరోకి వుండే ఫ్యాన్ ఫాలోయింగ్ ను బట్టి, ఆ సినిమా కాంబినేషన్, క్రేజ్ ను బట్టి ట్రయిలర్ కోసం ఎదురు చూసే లెక్కలు మారుతాయి. సినిమా క్రేజ్ బలంగా వుంటే మిగిలిన హీరోల ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు.

2023 లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు లెక్క వేసుకుంటే మాత్రం మోస్ట్ అవైటింగ్ ట్రయిలర్ గా ఆదిపురుష్ నిలుస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్, ప్రభాస్ ఇమేజ్ అని కాదు. రామాయణం కథా వస్తువు కావడం, ప్రభాస్ హీరో కావడం, పైగా పాన్ ఇండియా గ్రాఫిక్స్ సినిమా కావడం అన్నీ కలిసి సినిమా మీద బజ్ ను పెంచాయి. అయితే ఇవి మాత్రమే ట్రయిలర్ కోసం ఎదురు చూపులను పెంచలేదు. టీజర్ కారణంగా ట్రయిలర్ కోసం ఎదురు చూపులు పెరిగాయి.

ఆసక్తిగా అందరూ ఎదురు చూసిన టీజర్ నిరాశ పర్చింది. విమర్శలకు గురయింది. గెటప్ ల మీద, సిజి వర్క్స్ మీద గట్టి చివాట్లు పడ్డాయి సోషల్ మీడియాలో. ఇప్పుడు ట్రయిలర్ కోసం ఎదురుచూపులు అందుకే. విమర్శలు, ఫీడ్ బ్యాక్ మేరకు దర్శకుడు ఓమ్ రౌత్ జాగ్రత్తలు తీసుకున్నారా లేదా? గెటప్ లు మార్చారా లేదా? సిజి పనుల నాణ్యత పెంచారా లేదా? ఇవన్నీ తెలియాలంటే ట్రయిలర్ రావాలి.

ట్రయిలర్ బాగుంటే ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తారు. బాగా లేకపోతే యాంటీ ఫ్యాన్స్ సర్రున లేస్తారు. ఏమైనా టొటల్ గా ఆదిపురుష్ ట్రయిలర్ కోసం చాలా ఆసక్తి వుంది సినిమా అభిమానుల్లో. ఈ రోజు కొంత మంది చూస్తారు.  రేపు అందరూ చూస్తారు. అంతవరకు జస్ట్..వెయిటింగ్.