చౌదరి, రెడ్ల వల్ల నష్టం జరుగుతోంది- డిప్యూటీ సీఎం

ఏపీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర సంచలన వ్యాఖ్యలు చేశారు. సాలూరును షెడ్యూల్డ్ ఏరియాగా ప్ర‌క‌టించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. సెటిల‌ర్స్ వ‌ల్ల సాలూరు స్థానికులు న‌ష్ట‌పోతున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇత‌ర జిల్లాల…

ఏపీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర సంచలన వ్యాఖ్యలు చేశారు. సాలూరును షెడ్యూల్డ్ ఏరియాగా ప్ర‌క‌టించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. సెటిల‌ర్స్ వ‌ల్ల సాలూరు స్థానికులు న‌ష్ట‌పోతున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇత‌ర జిల్లాల నుండి వ‌చ్చిన చౌద‌రి, రెడ్లు వ‌ల్ల త‌మ ప్రాంతానికి న‌ష్టం జ‌రుగుతోందంటూ మండిప‌డ్డారు.

ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. సెటిల‌ర్స్ చేతిలోనే భూములు, వ్యాపారాలు అన్ని ఉన్నాయ‌ని.. గిరిజ‌నుల మీద బ్ర‌తుకుతూ గిరిజ‌నుల‌కు అన్యాయం చేస్తున్నార‌ని.. సాలూరులో సంపాదించుకుంటూ అభివృద్ధికి మాత్రం స‌హ‌క‌రించ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు కురిపించారు. ఈ ప‌రిస్థితి మారాలంటే సాలూరుని షెడ్డూల్డ్ ఏరియాగా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు. గిరిజన గ్రామాలకు నిర్మిస్తున్న రహదారులు, బ్రిడ్జిల వల్ల గిరిజనుల కంటే, ఎక్కడినుంచో వచ్చి  స్థిరపడినవారికే ఎక్కువగా ఉపయోగముందని కామెంట్స్ చేశారు.

ఏళ్ల క్రిందటే సాలూరుకు వ‌చ్చి సెటిల్ అయిన వారి గురించి డిప్యూటీ సీఎం ఇలా మాట్లాడ‌టం వెనుక రాజ‌కీయ కోణంలో చూస్తున్నారు ప్ర‌తిప‌క్షలు. వారు పండించిన పంట‌లు రోడ్ల మీద త‌ర‌లించ‌డం వ‌ల్లే రోడ్లు పాడైపోతున్నాయి అంటూ  మాట్లాడం అందరికీ ఆశ్చర్యం క‌లుగుతోంది. రాజ‌కీయ నాయ‌కులు స‌మ‌స్య‌ల‌ను ఎలా ప‌క్క‌దారి ప‌ట్టిస్తారో అనే దానికి రాజ‌న్న దొర తాజాగా మాట‌ల‌ను బ‌ట్టి ఆర్ధం చేసుకోవ‌చ్చు.