టెక్సాస్ కాల్పుల్లో తెలుగు విద్యార్థిని మృతి పట్ల రత్నాకర్ దిగ్భ్రాంతి

అమెరికా టెక్సాస్ లో జరిగిన కాల్పుల్లో తెలుగు విద్యార్థిని మృతి చెందడం పట్ల ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి (ఉత్తర అమెరికా) పండుగాయల రత్నాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి…

అమెరికా టెక్సాస్ లో జరిగిన కాల్పుల్లో తెలుగు విద్యార్థిని మృతి చెందడం పట్ల ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి (ఉత్తర అమెరికా) పండుగాయల రత్నాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

అమెరికాలో గన్ కల్చర్ కారణంగా ఎంతో మంది అమాయకులు  ప్రాణాలు కోల్పోతున్నారని, పౌరుల భద్రత పట్ల మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని పేర్కొన్నారు.

గన్ వైలెన్స్ నుండి అమెరికా పౌరులను రక్షించుకునేందుకు సంస్కరణలు అవసరమన్నారు. గన్ లైసెన్స్ ఇచ్చే విషయంలో యూనివర్సల్ బ్యాక్ గ్రౌండ్ చెక్స్ జరగాలన్నారు.

టెక్సాస్ షాపింగ్ మాల్ లో దుండగులు జరిపిన కాల్పుల్లో తెలుగు విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటనలో ఇప్పటివరకు మొత్తం 9 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. దుండగుల పై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక దుండగుడు మృతిచెందాడు. కాల్పుల ఘటన నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ ప్రకటన విడుదల చేశారు. కాల్పుల్లో 9 మంది మృతిచెందడం విషాదకరమని పేర్కొన్నారు.