బిగ్‌బాస్ ఫేం అవినాశ్ ఎదుగుద‌ల వెనుక ఓ ప్రేమికురాలు

తానొక భ‌గ్న ప్రేమికుడిన‌ని బిగ్‌బాస్ ఫేం అవినాశ్ చెబుతున్నారు. ఇటీవ‌లే ఆయ‌న హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన విష‌యం తెలిసిందే. క‌మెడియ‌న్‌గా సుప‌రిచితుడైన అవినాశ్ బిగ్‌బాస్ ప్రేక్ష‌కుల‌కు వంద‌శాతం వినోదం పంచారు. అయితే హౌస్…

తానొక భ‌గ్న ప్రేమికుడిన‌ని బిగ్‌బాస్ ఫేం అవినాశ్ చెబుతున్నారు. ఇటీవ‌లే ఆయ‌న హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన విష‌యం తెలిసిందే. క‌మెడియ‌న్‌గా సుప‌రిచితుడైన అవినాశ్ బిగ్‌బాస్ ప్రేక్ష‌కుల‌కు వంద‌శాతం వినోదం పంచారు. అయితే హౌస్ నుంచి బ‌య‌టికొచ్చాక చాలా విష‌యాలు అత‌ను బ‌య‌టికి చెబుతున్నారు.

జ‌గిత్యాల జిల్లా రాఘ‌వ‌పట్నం అనే చిన్న ప‌ల్లెటూరు త‌న స్వ‌స్థ‌ల‌మ‌న్నారు. హైద‌రాబాద్‌కు వ‌చ్చిన త‌ర్వాత  ఎన్నో ఆటుపోట్ల‌ను ఎదుర్కొన్న‌ట్టు అవినాశ్ తెలిపారు. ఐదుగురు పిల్ల‌ల్ని పెంచ‌డానికి అమ్మానాన్న ఎంతో క‌ష్ట‌ప‌డ్డారని గుర్తు చేసుకున్నారు. 

సినిమాలు, టీవీ అంటే పిచ్చితో మిమిక్రీ నేర్చుకున్నాన‌న్నారు.  స్టేజీ షోలు ఇస్తూ ముందుకెళ్లి ఇప్పుడు ఈ స్థాయికి వ‌చ్చిన‌ట్టు అత‌ను చెప్పారు.

ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న వ్య‌క్తిగ‌త‌, బిగ్‌బాస్ హౌస్ సంగ‌తుల‌ను చెప్పుకొచ్చారు. హౌస్‌లో అరియానా, అవినాశ్ మ‌ధ్య సంథింగ్ సంథింగ్ అనే ప్ర‌చారం ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అరియానాతో త‌న రిలేష‌న్ గురించి అవినాశ్ పంచుకున్నారు. 

అమ్మాయి, అబ్బాయి మ‌ధ్య ఆక‌ర్ష‌ణ స‌హ‌జ‌మ‌న్నారు. అలాగే ఒకే ఇంట్లో నెల‌ల త‌ర‌బ‌డి ఉన్న‌ప్పుడు ఎవ‌రికైనా న‌చ్చితే ఇష్ట‌ప‌డ‌డం కూడా అంతే స‌హ‌జ‌మ‌న్నారు.

అరియానాలో ముక్కు సూటిత‌నం త‌న‌కు బాగా న‌చ్చింద‌ని ప్ర‌క‌టించారు. అరియానా అంద‌రూ చూడ‌డానికి గంభీరంగా ఉంటున్నా, ఆమె సున్నిత మ‌న‌స్కురాల‌న్నారు. త‌న‌లోనూ ఆమెకు ఏదో న‌చ్చి ఉంటుందన్నారు. అందుకే తామిద్ద‌రూ మంచి స్నేహితులైన‌ట్టు అవినాశ్ వెల్ల‌డించారు.

అభిజిత్‌, అరియానాల‌లో ఒక‌రు  బిగ్‌బాస్ విజేత అవుతారని అవినాశ్ అభిప్రాయ‌ప‌డ్డారు. కానీ త‌న‌ ఫ్రెండ్ అరియానా విజేత అయితే తాను అయిన‌ట్టేన‌టి ప్ర‌క‌టించారు. స‌మాజానికి త‌మ టాలెంట్ ఏంటో చూప‌డానికి ఆర్టిస్ట్‌ల‌కు బిగ్‌బాస్ అనేది మంచి వేదిక‌గా అవినాశ్ అభిప్రాయ‌ప‌డ్డారు. 
త‌న వ‌ర‌కూ వ‌స్తే జీవితంలో బిగ్‌బాస్‌కు వెళ్లి రావ‌డం కీల‌క మ‌లుపుగా అభివ‌ర్ణించారు. బిగ్‌బాస్ హౌస్‌లో బ‌తుకు పాఠాలు నేర్చుకున్న‌ట్టు ఆయ‌న చెప్పారు.

త‌న విజ‌య ర‌హ‌స్యం ఏంటో అవినాశ్ బ‌య‌ట పెట్టారు. ఎక్క‌డ పోగొట్టుకుంటామో అక్క‌డే వెతుక్కోవాల‌నేది త‌న‌ గెలుపు సూత్ర‌మ‌న్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉంటూ ప్రేక్ష‌కుల‌తో పంచుకోని మ‌రో ముఖ్య విష‌యాన్ని అవినాశ్ బ‌య‌ట పెట్టారు. తాను భ‌గ్న‌ప్రేమికుడిన‌ని చెప్పారు. 

తెలిసీ తెలియ‌ని వ‌య‌సులో ప్రేమ‌లో ప‌డినట్టు తెలిపారు. పెద్ద‌ల అంగీకారంతో పెళ్లాడాల‌నుకున్నామ‌న్నారు. అయితే తాను ప్రేమించిన అమ్మాయి వెళ్లిపోయిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆ స‌మ‌యంలో పిచ్చివాడిలా మారిపోయాన‌న్నారు.

కొంత కాలానికి తేరుకున్న త‌ర్వాత దూర‌మైన అమ్మాయి అసూయ ప‌డేలా ఎద‌గాల‌నే ప‌ట్టుద‌ల త‌న‌లో పుట్టింద‌న్నారు. ఆ రోజు త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని అవినాశ్ తెలిపారు. ప్ర‌తి మ‌గాడి ఎదుగుద‌ల వెనుక ఓ మ‌హిళ ఉందంటారు. 

ఆ విధంగా అవినాశ్ ఆర్టిస్ట్‌గా ఎద‌గ‌డం వెనుక ఓ ప్రేమికురాలు ఉంద‌న్న మాట‌. ప్రేమికురాలు మోసం చేయ‌కపోతే, అవినాశ్‌లో అంత ప‌ట్టుద‌ల ఉండేది కాదేమోన‌ని ఆయ‌న అభిమానులు అంటున్నారు. 

ఈ స్కీమ్ సఫలం అయితే ఎపి దేశానికి రోల్ మోడల్ అవుతుంది