అనగనగా నాగబాబు.. అజ్ఞాన ప్రదర్శన!

ఏదో నికరంగా ఉపాధి కల్పిస్తున్న జబర్దస్త్ ప్రోగ్రాం మొత్తం తన నవ్వులు మీద ఆధారపడే నడుస్తున్నట్టుగా ఫీలయి ఆయన ఇంకో ఛానెల్ లో పెద్ద బేరానికి సొంత దుకాణం పెట్టుకున్నారు.  Advertisement జబర్దస్త్ అనేది…

ఏదో నికరంగా ఉపాధి కల్పిస్తున్న జబర్దస్త్ ప్రోగ్రాం మొత్తం తన నవ్వులు మీద ఆధారపడే నడుస్తున్నట్టుగా ఫీలయి ఆయన ఇంకో ఛానెల్ లో పెద్ద బేరానికి సొంత దుకాణం పెట్టుకున్నారు. 

జబర్దస్త్ అనేది చానెల్ హవామీద నడుస్తున్నది గానీ.. తన వెకిలి నవ్వుల మీద కాదనే సత్యం ఆయనకు నిదానంగా బోధపడింది. సొంతదుకాణం మూతపడింది. సినిమాల్లో దగ్గరకు తీసేవాళ్లు లేరు. పూర్తిగా ఖాళీ అయిపోతున్న సమయంలో అటు తమ్ముడి పరిస్థితి కూడా ఇంచుమించు అంతేగా ఉంది. 

పార్టీ పెట్టి పదేళ్లయినా తమ్ముడు పవన్ కల్యాణ్ పట్టుమని పదిమంది గట్టి నాయకులు లేరు. తలకాయ ఉన్నవాడని నమ్ముకున్న నాదెండ్లను మినహాయిస్తే.. నలుగురు గుర్తించగలిగిన మనిషి ఆ పార్టీలో లేడు. అలా ఇద్దరికీ గతిలేని పరిస్థితుల్లో తమ్ముడు పవన్, నాగబాబును జనసేన పార్టీకి రాష్ట్రప్రధాన కార్యదర్శిని చేసేశాడు. ఇక పదవి ఉన్నది గనుక.. ఏదో ఒకటి మాట్లాడక పోతే బాగుండదన్నట్టుగా నాగబాబు కూడా రెచ్చిపోతున్నాడు. తాజాగా ఆయన తన విమర్శలతో తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నాడు.

పవన్ కల్యాణ్ సీఎం అయిపోగానే.. తిరుమల తిరుపతి దేవస్థానాల అంతు తేలుస్తాం.. అక్కడ పరిస్థితులను అంతా చక్కదిద్దేస్తాం అన్నట్టుగా ఆయన ఓవరాక్షన్ డైలాగులు పలకడం విశేషం. పవన్ కల్యాణ్ సీఎం అయ్యాక.. హిందూ ధార్మిక సంస్థలు, అత్యధిక మంది భక్తుల అభిప్రాయాలు సేకరించి.. తదనుగుణంగా టీటీడీ పాలన తీరును మార్చేస్తారట. అంటే ఎవరు? పవన్ కల్యాణ్ కోసం క్షుద్రపూజలు చేస్తూ, ఆయనకు తావీదులు ప్రసాదిస్తున్న మంత్రగాళ్ల ఒపీనియన్ తీసుకుని తిరుమల ఎడ్మినిస్ట్రేషన్ లో మార్పులు చేస్తారా? అని జనం ప్రశ్నిస్తున్నారు. 

తిరుమల తిరుపతి దేవస్థానానికి కానుకల రూపంలో రోజూ వచ్చే ఆదాయానికి లెక్కా పత్రం లేకుండా పోతోందని నాగబాబు అంటున్నారు. తిరుమల వ్యవహారాల గురించి ఆయనకు ఏం జ్ఞానం ఉన్నదని ఆయన ఇలాంటి మాట అనగలుగుతున్నారో అర్థం కావడం లేదు. తిరుమలకు వచ్చే కానుకలకు లెక్కాపత్రం లేదనే నింద వేయాలంటే చాలా అజ్ఞానం కావాలి. అది నాగబాబుకు పుష్కలంగా ఉన్నట్టుంది. 

ఏదో తమ్ముడి పార్టీ తరఫున తన కులంవాళ్లతో నిత్యం సమావేశాలు అవుతూ వాళ్లందరినీ కూడగట్టడానికి కొన్నేళ్లుగా కష్టపడుతున్న నాగబాబు.. ఇప్పుడు పార్టీ పదవి రాగానే తన పరిధి పెరిగిపోయినట్టు తన జ్ఞానానికి మించిన వ్యవహారాల్లో వేలుపెట్టడం చూసి జనం నవ్వుకుంటున్నారు.