మేకోవర్ మాత్రమే కాదు.. ఫిజికల్ ఫిట్ నెస్ కూడా?

రీసెంట్ గా బయటకొచ్చిన చిరంజీవి ఫొటోలు కొన్ని మెగా ఫ్యాన్స్ ను ఎట్రాక్ట్ చేశాయి. ఆ ఫొటోల్లో చిరంజీవి క్లీన్ షేవ్ తో బాగున్నారు. ఇదంతా కొత్త సినిమా కోసమే అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు.…

రీసెంట్ గా బయటకొచ్చిన చిరంజీవి ఫొటోలు కొన్ని మెగా ఫ్యాన్స్ ను ఎట్రాక్ట్ చేశాయి. ఆ ఫొటోల్లో చిరంజీవి క్లీన్ షేవ్ తో బాగున్నారు. ఇదంతా కొత్త సినిమా కోసమే అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు. అందులో కొంత నిజం కూడా ఉంది. అయితే ఆయన ఇప్పట్లో కొత్త సినిమా సెట్స్ పైకి రాకపోవచ్చు.

అందరూ చిరంజీవి కొత్త ఫొటోలు మాత్రమే చూస్తున్నారు, కానీ ఆయన ఫిట్ నెస్ గురించి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ప్రస్తుతం ఆయన ఫిజియోథెరపీ సెషన్స్ లో బిజీగా ఉన్నారు. పూర్తిగా ఫిట్ అవ్వడానికి మరికొన్ని రోజులు పడుతుంది.

కొన్నాళ్ల కిందట ఢిల్లీ వెళ్లి మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు చిరంజీవి. అది మైనర్ సర్జరీనే. కాకపోతే ఫిజియో థెరపీ చేయించుకోవాల్సి ఉంది. చిరు ఆ సెషన్స్ కు హాజరయ్యారు కూడా. అయితే వయసురీత్యా, ఆయన మరిన్ని ఫిజియోథెరపీ సెషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం ఆయన అదే పనిలో ఉన్నారు.

అన్నీ అనుకున్నట్టు సాగితే, డిసెంబర్ నుంచి చిరంజీవి సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించారు చిరు. దీంతో పాటు కూతురు సుశ్మిత నిర్మాతగా ఓ మూవీ చేయబోతున్నారు. అయితే వీటిలో సుశ్మిత సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేలా కనిపించడం లేదు. అప్పట్లో అనకున్న కథ దాదాపు పక్కనపెట్టారు.. వశిష్ఠ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి. పంచభూతాలు కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తోంది.