ప్రపంచంలోనే తొలిసారి.. గర్భస్థ శిశువుకు సర్జరీ

అమెరికా వైద్యులు చరిత్ర సృష్టించారు. కడుపులో ఉన్న బిడ్డకు బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. ఓ గర్భస్థ శిశువుకు ఈ తరహా ఆపరేషన్ చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి. Advertisement 34 వారాల గర్భంతో ఓ…

అమెరికా వైద్యులు చరిత్ర సృష్టించారు. కడుపులో ఉన్న బిడ్డకు బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. ఓ గర్భస్థ శిశువుకు ఈ తరహా ఆపరేషన్ చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి.

34 వారాల గర్భంతో ఓ మహిళ బోస్టన్ హాస్పిటల్ లో జాయిన్ అయింది. అల్ట్రా సౌండ్ స్కాన్ చేసిన వైద్యులు, బిడ్డ మెదడులో సమస్య ఉన్నట్టు గుర్తించారు. శిశువు మెదడు నుంచి గుండెకు సరఫరా అయ్యే రక్తనాళంలో సమస్య ఉంది. దీన్ని వైద్య పరిభాషలో వీనస్ ఆఫ్ గ్యాలెన్ వైకల్యంగా చెబుతారు.

ఈ సమస్యతో పుట్టిన పిల్లలు ఎక్కువ రోజులు బతకరు. బ్రెయిన్ స్ట్రోక్ లేదా హార్ట్ స్ట్రోక్ తో మరణిస్తారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడే ఈ సమస్యను గుర్తించిన వైద్యులు, శిశువుకు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బోస్టన్ చిల్ట్రన్స్ హాస్పిటల్, బ్రిగమ్ ఉమెన్స్ హాస్పిటల్ వైద్యులు కలిసి విజయవంతంగా ఆపరేషన్ పూర్తిచేశారు.

చికిత్సలో భాగంగా గర్భంలో ఉన్న శిశువు మెదడులో ఉన్న రక్తనాళాన్ని సరిచేశారు. రక్తప్రవాహాన్ని నియంత్రించే ఓ కాయిల్ ను కూడా ఏర్పాటుచేశారు. ప్రపంచంలో ఈ తరహా ఆపరేషన్ చేసి, సక్సెస్ అవ్వడం ఇదే తొలిసారి.