సిద్దిపేట జిల్లా పొట్లపల్లిలో హృదయ విదారక ఘటన జరిగింది. నలుగురు కొడుకులు ఉన్న తనను సరిగ్గా పట్టించుకోలేదని మెడబోయిన వెంకటయ్య(90) అనే వృద్దుడు ఊరి చివర చితి పేర్చి, నిప్పంటించి అందులో దూకి చనిపోయారు.
గతంలో వృద్ధుడి భార్య చనిపోవడంతో పొలాన్ని తన నలుగురు కుమారులకు తన పేరిట రాసిచ్చాడు. కొంతకాలంగా స్వగ్రామంలో ఉంటున్న పెద్ద కొడుకు ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే ఐదు నెలల క్రితం, నలుగురు కొడుకులు తమ తండ్రిని పెద్దల సమక్షంలో నెలకు ఒక వంతు చొప్పున ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఇద్దరు కుమారులు సొంత గ్రామంలో ఉండగా ఒకరు ముస్నాబాద్లో, మరొకరు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటలో నివసిస్తున్నారు. కానీ వెంకటయ్య మాత్రం తన ఊరు విడిచి వెళ్లడానికి మనసు ఒప్పుకోలేదు. అంతేకాకుండా వెంకటయ్య తన కుమారుల ఇళ్లలో నెలలు వారిగా వెళ్లడం ఇష్టంలేక తన చేతితో చితిని పేర్చుకుని తానే నిప్పంటించుకుని చనిపోయాడు.