అకీరా ఎంట్రీకి వేళాయెరా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సడెన్ గా ఏదో ఒకటి చేస్తుంటారు. నిజానికి అందరికీ అది నాన్ ప్లానింగ్ గా అనిపిస్తుంది. కానీ ఆయన చాలా ప్లాన్డ్ గా వ్యవహరిస్తారు. చివరి నిమిషం వరకు…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సడెన్ గా ఏదో ఒకటి చేస్తుంటారు. నిజానికి అందరికీ అది నాన్ ప్లానింగ్ గా అనిపిస్తుంది. కానీ ఆయన చాలా ప్లాన్డ్ గా వ్యవహరిస్తారు. చివరి నిమిషం వరకు అలా ఎవరికీ ఏమీ చెప్పకుండా, హడావుడి చేయకుండా వుంటారు. 

నిన్నటి వరకు మెగాడాటర్ నీహారిక పెళ్లికి వెళ్తారా? వెళ్లరా? అన్న అనుమానం. ముందుగా ప్లాన్ చేసారు కానీ, రాజకీయ పరిస్థితులు, దీక్షలు వగైరా వుండడంతో వెళ్లరేమో అన్న అనుమానాలు వినిపించాయి.

కానీ లాస్ట్ మినిట్ లో బయల్దేరి వెళ్లారు. అది కూడా కొడుకు అకీరాతో కలిసి. ఇది ఊహించని ట్విస్ట్. మెగా ఫ్యామిలీకి ఇప్పడు పవన్ మూడో భార్య చాలా దగ్గరయ్యారు. 

ఆ ఇళ్లలో ఏ ఫంక్షన్ అయినా ఆమె కనిపిస్తూ వచ్చారు. అందువల్ల పెళ్లికి కూడా ఆమె వెళ్తారనే అనుకున్నారంతా. కానీ ఆమె వెళ్లలేదు. సడెన్ గా రెండో భార్య రేణు కొడుకు అకీరా తండ్రి పక్కన కనిపించాడు.

పిల్లలు పెద్దకావడం, అకీరాను హీరోగా లాంచ్ చేయాలంటే పవన్ సాయం అవసరం కావడంతో ప్రస్తుతం రేణు ఇక్కడికే మకాం మార్చారు. 

ఇప్పుడు అకీరా ఒక్కసారిగా మెగా ఫ్యామిలీ ఈవెంట్ లోకి రావడం, కెమేరాలు అతనిపై పోకస్ కావడం, పైగా ప్రస్తుతం పవన్ తో వుంటున్న భార్య, పిల్లలు ఈ ఫంక్షన్ కు రాకపోవడం చూస్తుంటే, ఇదంతా పవన్ ప్లాన్ అనిపిస్తోంది. 

అకీరా ను ఫ్యామిలీలోకి తీసుకురావాలని, అతని పై ఫోకస్ వుండాలనే పవన్ ఇలా చేసి వుండొచ్చు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

పవన్ స్నేహితుడు దర్శకుడు త్రివిక్రమ్ ఇప్పటికే అకీరాను లాంచ్ చేసే కథ కోసం చూస్తున్నారని, అలాంటి సబ్జెక్ట్ దొరికితే మంచి బ్యానర్, డైరక్టర్ చేతిలో అకీరాను పెడతారని తెలుస్తోంది. 

మళ్ళీ అదే ప్రశ్న