భన్సాలీ తో బన్నీ?

హీరో బన్నీ పేరు రకరకాల దర్శకులతో ముడిపెట్టి వార్తలు వస్తూనే వున్నాయి. ఈ జాబితాలో ఇప్పుడు మరో దర్శకుడి పేరు వినిపిస్తోంది.  Advertisement బాలీవుడ్ లో భారీ సినిమాలు, అందులోనూ పీరియాడిక్ సినిమాలతో ఓ…

హీరో బన్నీ పేరు రకరకాల దర్శకులతో ముడిపెట్టి వార్తలు వస్తూనే వున్నాయి. ఈ జాబితాలో ఇప్పుడు మరో దర్శకుడి పేరు వినిపిస్తోంది. 

బాలీవుడ్ లో భారీ సినిమాలు, అందులోనూ పీరియాడిక్ సినిమాలతో ఓ క్రేజ్ ను స్వంతం చేసుకున్న సంజయ్ లీలా భన్సాలీ తో బన్నీ టీమ్ డిస్కషన్లు సాగిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీ తన ఫ్యూచర్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ప్లాన్డ్ గా వ్యవహరిస్తున్నారు. కాస్త అవకాశం వున్న ఏ దర్శకుడినీ వదిలేయడం లేదు. లైన్ లో పెట్టి వుంచుతున్నారు.

కథలు చేయమంటున్నారు. డిస్కషన్లు సాగిస్తున్నారు. తనే తన టీమ్ తో డీల్ చేయిస్తున్నారు తప్ప నిర్మాతల ద్వారా కాదు. అందువల్ల పక్కాగా చేస్తారనీ కాదు, చేయరనీ కాదు. కథ తయారుకావడం బట్టి వుంటుంది. అన్నీ సెట్ అయితే నిర్మాత ఎవరు అన్నది తేలడం క్షణాల్లో పని. అప్పటి వరకు బోలెడు పేర్లు బన్నీ కాంబినేషన్ లో వినిపిస్తూనే వుంటాయి.

సంజయ్ లీలా భన్సాలీతో సినిమా అంటే కచ్చితంగా మంచి బజ్ వుంటుంది. బాలీవుడ్ లో సినిమా చేయడం ద్వారా పాన్ ఇండియా సినిమా చేసినట్లూ వుంటుంది. అదే సమయంలో తెలుగులో సరైన సినిమా చేసినట్లూ వుంటుంది. అదే సమయంలో బన్నీ మన గ్రౌండ్ వదలడం లేదు. త్రివిక్రమ్, సురేందర్ రెడ్డి లాంటి వాళ్లనూ లైన్ లో వుంచుతున్నారు.